'రష్మి'పై లైంగిక దాడి.. మీడియా ముందు బట్టబయలు

By సుభాష్  Published on  4 March 2020 5:09 PM IST
రష్మిపై లైంగిక దాడి.. మీడియా ముందు బట్టబయలు

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని కొన్ని ఆఫర్లు రావాలంటే అమ్మాయిలు తమను తాము అమ్ముకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. కాగా, కొందరు మాత్రం ఇండస్ట్రీలో అలాంటిదేమి లేదని చెబుతున్నా.. ఇండస్ట్రీలో మాత్రం ఇలాంటివి జరుగుతున్నాయని కొందరు రోడ్డుపైకి వచ్చి బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డి మొదలు పెట్టిన కాస్టింగ్‌ కౌచ్‌ యుద్ధం వల్ల చాలా మంది బయటకు వచ్చి తమకు ఎదురైన అనుభవాలను బయటపెడుతున్నారు. సింగర్‌ చిన్మయి ఇప్పటికే దీనిపై పోరాటం చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా, హిందీలో బుల్లితెరపై తన కెరీర్ మొదలు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మి దేశాయ్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. తాజాగా తనపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన విషయాలను బట్టబయలు చేసింది. కాగా, ఇప్పుడు తన జీవితంలో జరిగిన చేదు నిజాలను మీడియా ముందు పెట్టింది. తన కెరీర్ ప్రారంభ సమయంలోనే సూరజ్‌ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు గురయ్యానని రష్మి దేశాయ్‌ తెలిపింది.

తాను 13 ఏళ్ల కిందటనే కెరీర్‌ ప్రారంభించానని, ఆ సమయంలో ఇండస్ట్రీలో రాణించాలంటే లొంగక తప్పదని కొందరు బలవంతం చేశారని తెలిపింది. అందులో సూరజ్‌ ఒకరని చెప్పింది.

ఆడిషన్స్ ఉన్నాయని చెప్పి..

అప్పట్లో ఆడిషన్స్‌ ఉన్నాయని తనకు ఫోన్‌ చేసి ఓ అడ్రస్‌ చెప్పి అక్కడికి రావాలని సూరజ్‌ చెప్పాడని, తీరా అక్కడికి వెళ్తే మత్తు మందు కలిపిన డ్రంక్‌ ఇచ్చి తన జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడని రష్మి దేశాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం గురించి నా తల్లికి చెప్పడంతో సూరజ్‌ ఇంటికెళ్లి గట్టిగా వార్నింగ్‌ కూడా ఇచ్చిందని తెలిపింది. అమ్మాయిలు భయపడకుండా అలాంటి సమయంలో ధైర్యంతో ఉండాలని సూచించింది రష్మి దేశాయ్‌.

Next Story