బాలీవుడ్‌ నటుడిపై నటి రాధిక ఫైర్‌..

By సుభాష్  Published on  1 Nov 2020 6:40 PM IST
బాలీవుడ్‌ నటుడిపై నటి రాధిక ఫైర్‌..

బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా చేసిన వ్యాఖ్యలపై నటి రాధాకి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూర్ఖత్వంతో కొంత మంది అలా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. శక్తిమాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముఖేష్‌ ఖన్నా మీటూ ఉద్యమం గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయంలోనూ తాము పురుషులతో సమానమని, స్త్రీలు ఆలోచించడం వల్ల మీటూ ఉద్యమం అనేది తెరపైకి వచ్చిందని, ఇంటిని చక్కదిద్దడం మాత్రమే మహళల పని అని ఆయన చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అలాగే గాయని చిన్మయి ముఖేష్‌ని విమర్శిస్తూ ఓ ట్వీట్‌ చేశారు.

ఈ మధ్య కాలంలో కొంత మంది మానసిక ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది, నిజాన్ని గ్రహించకుండా పాత ధోరణిలోనే ఆలోచిస్తుంటారని, మహిళలు పనులు, ఉద్యోగాలు చేయడం వల్ల మీటూ ఉద్యమం ప్రారంభమైందన్న ఆయన.. పురుషులు తమ హింసాత్మకమైన కోరికలను కంట్రోల్‌ చేయకపోవడం వల్లే ఇలాంటివి కొనసాగుతున్నాయన్నారు.

Next Story