శ్రీరెడ్డిపై నటి కరాటే కల్యాణి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి అసభ్యకరంగా దూషిస్తోందని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, గతంలో కూడా కల్యాణిపై  సోషల్‌ మీడియా వేదికగా వచ్చిన అసభ్యకరమైన పోస్టుల పట్ల కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాపై కావాలనే అసభ్యకరంగా దూషిస్తున్నారని కల్యాణి ఆరోపిస్తోంది. శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి చర్యలు చేపడతామని తెలిపారు.

కాగా, కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలతో ఇండస్ట్రీలో శ్రీరెడ్డి సంచలన రేపిన విషయం తెలిసిందే. తమిళ సినిమాల్లో అవకాశాలు రావడంతో శ్రీరెడ్డి చెన్నైకి వెళ్లిపోయింది. సోషల్ మీడియా వేదికగా ఎంతో మందిపై సంచలన కామెంట్ల చేసింది. అలాగే దర్శకుడు మురుగదాస్‌, సుందర్‌, లారెన్స్‌, హీరో విశాల్‌లపై కూడా ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డిపై ఇప్పటి చాలా మంది పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.