సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన అలనాటి నటి జమున డ్యాన్స్‌ వీడియో

By సుభాష్  Published on  18 April 2020 10:01 AM GMT
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన అలనాటి నటి జమున డ్యాన్స్‌ వీడియో

అలనాటి అందాల నటి జమున ఇంట్లో ఉల్లాసంగా గడుపుతున్నారు. ఆమె నటించిన సినిమాలోని ఓ పాటకు అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తూ అలరించారు. నటి జమున తనలో ఉన్న డ్యాన్స్‌ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌లో ఉంటే . ఆమె మాత్రం ఉంట్లో ఉంటూ తన పాత జ్ఞాపకాలను నెమరువేసుంటున్నారు. మిస్సమ్మ మూవీలోని 'తెలుసుకొనవె చెల్లీ' పాటకు స్టెప్పులేస్తున్న వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

జామున డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో జమున ఎంజాయ్‌ చేస్తున్నారు. మిస్సమ్మ సినిమాలో ఈ పాటను వింటూ డ్యాన్స్‌ చేస్తూ మైమరచిపోయారు. తనలో ఎనర్జీ లెవల్స్‌ తగ్గలేదని ఫ్రూవ్‌ చేసుకుంటున్నారు జమున.

తెలుగు మాతృభాష కాకపోయినా తెలుగు నేలలో పెరిగి, తెలుగు చలన చిత్రంలో అరుదైన కథనాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి జనము 198 సినిమాల్లో నటించారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్‌ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్‌ అవార్డు లభించింది. ఇంకా సినిమాల ద్వారా ఎన్నో అవార్డులు అందుకున్నారు జమున.Next Story
Share it