ప్రముఖ సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జన్మించారు గీతాంజలి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లో ఆమె నటించి పేరు ప్రఖ్యాతలు గడించారు. సీతారామకల్యాణం, మర్యాదరామన్న, లేతమనసులు, మురళీ కృష్ణ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు.

జానపద చిత్రాల్లో పద్మనాభం వంటి నటుల సరసన నటించి మెప్పించారు. ఆమె తన సహ నటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు. కలవారి కోడలూ, డాక్టర్ చక్రవర్తి, లేత మనసులు, ఇల్లాలు వంటి 500 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవల, కొన్ని సినిమాలలో బామ్మ క్యారెక్టర్లను పోషించారు గీతాంజలి. పలు సీరియళ్లలోనూ నటించారు ఆమె. నందినగర్ లోని నివాసంలో, గీతాంజలి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచుతారు.

గీతాంజలి మరణంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినిమాల్లో గీతాంజలి చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించిన గీతాంజలి అక్కడ కూడా తన ప్రతిభ చూపారని పేర్కొన్నారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సత్య ప్రియ బి.ఎన్