ఆటపాటల నడుమ వేడుకగా నటి అర్చన సంగీత్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Nov 2019 6:39 AM GMT
తెలుగు అందాల తార అర్చన ఇంట పెళ్లి సందడి మొదలైంది. పారిశ్రామికవేత్త జగదీష్‌తో నటి అర్చన వివాహం జరగనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో పెళ్లి వేడుక నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలోనే 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరగనుంది. దీనిలో భాగంగా రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వధువరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు. అర్చన స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధువరులతో పాటు ఆడిపాడారు. ఎంతో ఘనంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.
Next Story