నితిన్ ఫ్రెండ్ షిప్ ను.. పెళ్లి దాకా ఎలా తీసుకొని వెళ్లాడంటే..?
By సుభాష్ Published on 17 Feb 2020 3:16 PM IST![నితిన్ ఫ్రెండ్ షిప్ ను.. పెళ్లి దాకా ఎలా తీసుకొని వెళ్లాడంటే..? నితిన్ ఫ్రెండ్ షిప్ ను.. పెళ్లి దాకా ఎలా తీసుకొని వెళ్లాడంటే..?](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/02/Actor-nithin-marriage.jpg)
టాలీవుడ్ హీరో నితిన్ త్వరలోనే ఓ ఇంటి వాడు అవ్వనున్నాడు. గత కొద్దిరోజులుగా నితిన్ పెళ్లి గురించి టాలీవుడ్ లో రూమర్లు విపరీతంగా వ్యాపించిన సంగతి తెలిసిందే..! షాలినీ అనే యువతిని నితిన్ పెళ్లి చేసుకోనున్నాడు. నితిన్ పెళ్లి వార్త విన్నాక ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి పనులు మొదలయ్యాయి అంటూ నితిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.
ఫ్రెండ్షిప్- ప్రేమ- పెళ్లి
‘ఇష్క్’ (2012) సినిమా సమయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా షాలినీని కలిశానని నితిన్ చెప్పాడు. ఆమెను చూడగానే మనసుకు బాగా నచ్చిందని.. మొదట్లో ఫ్రెండ్స్‌లానే ఉండేవాళ్లమని చెప్పాడు నితిన్. కొంత సమయం తరవాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాకనే ప్రేమలో ఉన్నామని తనకు అర్థమైందని అన్నాడు నితిన్. గత ఏడాది ఇంట్లోవాళ్లకు చెప్పగా.. రెండు కుటుంబాలవారు ఎటువంటి అభ్యంతరం లేకుండా అంగీకరించాయని ఆనందంగా చెప్పాడు నితిన్. నలుగురి కంట్లో పడితే బాగోదని కారులో బాగా తిరిగేవాళ్లమని నితిన్ చెప్పాడు. మా ఫేవరెట్ డ్రైవ్ ఇన్ ఉందని.. అక్కడికే ఎక్కువ సార్లు వెళ్తుంటామని నితిన్ చెప్పాడు. షాలినీ అందరినీ ఒకే లాగా చూస్తుందని.. అందుకే తనంటే ఇష్టం ఏర్పడిందని ఆమెలో ఉన్న బెస్ట్ క్వాలిటీని బయటపెట్టాడు నితిన్. షాలినీ కుటుంబానికి సినిమా నేపథ్యం లేదని.. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లేనని నితిన్ క్లారిటీ ఇచ్చాడు. ఏప్రిల్ 16న దుబాయ్ లో పెళ్లి చేసుకోబోతున్నారు వీరిద్దరూ.. ఏప్రిల్ 22 లేదా 23 ఇండస్ట్రీ వాళ్లకు రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.