కోడెల కేసు లో పురోగతి సాధిస్తాం - ఏసీపీ కేఎస్‌ రావు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2019 10:50 AM GMT
కోడెల కేసు లో పురోగతి సాధిస్తాం - ఏసీపీ కేఎస్‌ రావు

అమరావతి: ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు . ఆత్మహత్యకు కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని విచారించినట్లు తెలిపారు. కోడెల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్స్‌ రికార్డ్ చేశామన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తమకు అందలేదన్నారు. కోడెల ఫోన్‌ కాల్ డేటాపై ఆరా తీస్తున్పట్లు తెలిపారు. CDRA కాల్ లిస్ట్ రిపోర్ట్ పరిశీలిస్తున్నామన్నారు. కోడెల కుమారుడు శివరాం ను త్వరలో విచారిస్తామని చెప్పారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏసీపీ. సోషల్ మీడియాలో కాల్ డేటా పై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. త్వరలోనే ఈ కేసు లో పురోగతి సాధిస్తామని స్పష్టం చేశారు ఏసీపీ కేఎస్‌ రావు.

Next Story
Share it