నల్లధనం స్విస్ పుట్ట బద్దలు : కేంద్రం చేతిలో భారతీయ నల్లకుబేరుల జాబితా
By Newsmeter.Network
బెర్న్: ఎట్టకేలకు స్విట్జర్లాండ్ స్విస్ నల్లధనం ఖాతాల గుట్టురట్టయింది. స్విట్జర్లాండ్ జాతీయ టాక్స్ పరిపాలన విభాగం భారత్ సహా 75 దేశాలకు సంబంధించిన 31లక్షల ఖాతాల జాబితా విడుదల చేసింది.
స్విట్జర్లాండ్ జాతీయ టాక్స్ పరిపాలన విభాగం ఆదేశంలోని 7400 బ్యాంక్‌లు, ట్రస్ట్‌లు, బీమా విభాగాల నుంచి ఖాతాల వివరాలు సేకరించారు. దేశంలో ఎప్పటి నుంచో నల్లధనం ఖాతాల వివరాలు బయట పెట్టాలనే డిమాండ్ ఉంది. అయితే.. ఈ ఖాతాల వివరాలు భారత ప్రభుత్వానికి అందించినా.. ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. భారత ప్రభుత్వానికి నల్లధనం ఖాతాదారుల వివరాలు, పేర్లు, జమ అయిన నగదు గురించి మొట్టమొదటి సారి బయట పెట్టింది. 2020 సెప్టెంబర్‌లో రెండో జాబితా అందిచనుంది.
75దేశాల్లో ఇప్పటికే 63 దేశాలకు సంబంధించిన వివరాలు స్విస్ అందించింది. భారత దేశానికి సంబంధించిన ఖాతా దారుల వివరాల్లో వ్యాపార వేత్తలు, అమెరికా, లండన్ తదిరత దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఉన్నారు. అయితే.. దీనిలో 100 అకౌంట్లు 2018కి ముందే ఖాళీ అయ్యాయి. ఆటో ఇండస్ట్రీ, రసాయనాలు, టెక్స్ టైల్స్, డైమండ్ జ్యులరీ, స్టీల్ వ్యాపార వేత్తలు స్విస్ ఇచ్చిన నివేదికలో ఉన్నారు.
https://www.estv.admin.ch/estv/en/home/die-estv/medien/nsb-news_list.msg-id-76625.html
ఇటీవల ఆగస్ట్‌లో స్విస్‌కు చెందిన ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటించి ఖాతాలకు సంబంధించి చర్చలు జరిపింది. అయితే...నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ ఖాతాదారులపై ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి.