ఏసీబీకి చిక్కిన వీఆర్వో అధికారి

By Newsmeter.Network  Published on  27 Nov 2019 11:49 AM GMT
ఏసీబీకి చిక్కిన వీఆర్వో అధికారి

మేడ్చల్‌: ఓ వీఆర్వో అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లి మండలంలో పనిచేస్తున్న వీఆర్వో వెంకటేశం.. రైతుల దగ్గర రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అయితే వీఆర్వో వెంకటేశం.. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతులను బెదిరించి వీఆర్వో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వీర్వో వెంకటేశంను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం వెంకటేశం ఇంట్లో,ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

Next Story