ఆ తహసీల్దార్‌కు ఆశ్రయం ఇస్తే కఠినంగా శిక్షిస్తాం: ఏసీబీ డీఎస్పీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 9:10 AM GMT
ఆ తహసీల్దార్‌కు ఆశ్రయం ఇస్తే కఠినంగా శిక్షిస్తాం: ఏసీబీ డీఎస్పీ

కర్నూలు: ఆ తహసీల్దార్‌కు ఆశ్రయం ఇస్తే కఠినంగా శిక్షిస్తాం. ఇదేం స్టేట్‌మెంట్‌ అనుకుంటున్నారా..? గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ ఏసీబీ కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కేసు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం హెచ్చరించారు. తన వ్యక్తిగత సహాయకుడు బాషా ద్వారా లంచం తీసుకున్న గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ ఇంకా పరారీలో ఉన్నారు. ఈ తరుణంలోనే ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆమె కోసం పలు బృందాలు గాలిస్తున్నాయి. ఈ మేరకు ఆమె గురించి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ఏసీబీ డీఎస్పీ ప్రజలను కోరారు. మరోవైపు తహసీల్దార్‌ హసీనాబీ సూచనల మేరకు లంచం తీసుకున్న మహబూబ్‌బాషాను శనివారం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీనాగభూషణం తెలిపారు.

Next Story