జార్జి రెడ్డి' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 2:25 PM GMT
జార్జి రెడ్డి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్‌

హైదరాబాద్ :మోస్ట్ సెన్సేషనల్ మూవీ జార్జిరెడ్డి తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని అభిషేక్ పిక్చర్స్‌ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు లాంటి సూపర్ హిట్ మూవీలను అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ ఓనర్ అభిషేక్ నామా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ 'జార్జి రెడ్డి' రైట్స్ ను సొంతం చేసుకోవడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది. రీసెంట్ గా రిలీజ్ అయిన 'జార్జి రెడ్డి' ట్రైలర్ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గతంలో 'దళం' సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. 'వంగవీటి' ఫేం సందీప్ మాధవ్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు నటించారు. ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. సంచలనాత్మక మరాఠి సినిమా 'సైరాత్' కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు.

'జార్జి రెడ్డి'చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Next Story