అబ్దుల్ కలాం పేరు మార్పు జీవో ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 8:40 AM GMT
అబ్దుల్ కలాం పేరు మార్పు జీవో ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం..!

అమరావతి: ప్రతిభా పురస్కారాలకు మిస్సైల్ మేన్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మార్పుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై అధాకారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. యథాతథంగా అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఆదేశాలు. దీంతోపాటు దేశంలోని మహానీయుల పేర్లు పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీచ అంబేద్కర్‌, జ్యోతి బాపూలే, జగజ్జీవన్ రామ్ లాంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని, ప్రణాళికలు తయారు చేయాలని అధికారును జగన్‌ కోరారు.

జీవో జారీ చేసిన వారిని ప్రభుత్వం సస్పెండ్ చేయాలి: పవన్ కల్యాణ్

ప్రభుత్వం ప్రతిభ పురస్కారానికి అబ్దుల్‌ కలామ్‌ పేరు మార్చడం సమంజసం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దేశానికి మిస్సైల్‌ పరిజ్ఞానం ఇచ్చిన మేధావి కలామ్‌.. ఆయన పేరిట ఉన్న పురస్కారానికి సీఎం జగన్‌ నాన్న పేరు ఎలా పెడుతారంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. వైఎస్సార్‌ పేరు చాలా పథకాలకు పేరు పెట్టారు.. కావాలంటే కొత్త పథకాలకు వైఎస్సార్‌ పేరు పెట్టుకోవాలన్నారు. జాతికి సేవలు చేసిన వారిని గౌరవించడం తెలియదా.. వారికి ఇచ్చే మర్యాద ఇదేనా? అని అన్నారు. జాతీయ పతాకాన్ని గౌరవించలేని వారికి జాతికి సేవ చేసిన వారి విలువ ఏం తెలుస్తుందన్నారు. ప్రజా వ్యతిరేకత చూసే ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ తెచ్చిన జీవోను రద్దు చేశారు. ఆ జీవో ఇచ్చిన వారిని ప్రభుత్వం తక్షణమే సస్పెండ్‌ చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. సస్పెండ్‌ చేయలేదు అంటే ప్రభుత్వం జాతికి సేవ చేసిన వారికి ద్రోహం చేసినట్టేనన్నారు. సీఎం జగన్‌ రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమన్నారు. కర్నూలులో కోర్టు పెడితే పులివెందుల నుంచి వెళ్లి రావడం సులువుగా ఉంటుందని, ఖర్చు కూడా తగ్గుతుందని జనసేన అధినేత పవన్‌ ఎద్దేవా చేశారు.





విశాఖ: ప్రభుత్వం ప్రతిభ పురస్కారానికి అబ్దుల్‌ కలామ్‌ పేరు మార్చడం సమంజసం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దేశానికి మిస్సైల్‌ పరిజ్ఞానం ఇచ్చిన మేధావి కలామ్‌.. ఆయన పేరిట ఉన్న పురస్కారానికి సీఎం జగన్‌ నాన్న పేరు ఎలా పెడుతారంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. వైఎస్సార్‌ పేరు చాలా పథకాలకు పేరు పెట్టారు.. కావాలంటే కొత్త పథకాలకు వైఎస్సార్‌ పేరు పెట్టుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేకత చూసే ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ తెచ్చిన జీవోను రద్దు చేశారు. ఆ జీవో ఇచ్చిన వారిని ప్రభుత్వం తక్షణమే సస్పెండ్‌ చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. సస్పెండ్‌ చేయలేదు అంటే ప్రభుత్వం జాతికి సేవ చేసిన వారికి ద్రోహం చేసినట్టేనన్నారు. సీఎం జగన్‌ రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమన్నారు. కర్నూలులో కోర్టు పెడితే పులివెందుల నుంచి వెళ్లి రావడం సులువుగా ఉంటుందని, ఖర్చు కూడా తగ్గుతుందని జనసేన అధినేత పవన్‌ ఎద్దేవా చేశారు.

Next Story