ప్రపంచంలోనే అరుదైన ఆణిముత్యం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో దొరికింది. అబుదాబిలోని మురావాలో జరిపిన తవ్వకాల్లో ఆ ముత్యం బయటపడింది. ఇది దాదాపు 8 వేల ఏళ్ల క్రితం నాటిది. ఇది క్రీస్తు పూర్వం 5,800-5,600 కాలానికి చెందినదని కార్బన్‌ డేటింగ్‌ పద్ధతి ద్వారా కనుగొన్నారు. నవీన శిలాయుగంలో నూ వస్తువుల వాణిజ్యం ఉందనడానికి ఈ ముత్యమే ఓ రుజువు అని అధికారులు పేర్కొన్నారు. యూఏఈ ఆర్థిక, సాంస్కృతిక చరిత్రకు చాలా లోతైన పునాదు లు ఉన్నట్లు తెలుస్తోందన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.