పేదరికంపై పోరాటానికి వారికి నోబెల్ వచ్చింది. మనం ఎంత చంద్ర మండలం మీదకు పోయినప్పటికీ..భూమిపై ఆకలి చావులు మాత్రం ఆగడం లేదు. భూమండలంపై దాదాపు 70 కోట్ల మందికి కనీస అవసరాలు అందుబాటులో లేవు. విద్య, వైద్యమైతే 100 కోట్ల మందికి అందుబాటులో లేదు. దీనిని జయించడానికి ముగ్గురు పరిశోధకులు రంగంలోకి దిగారు. గ్రౌండ్ స్థాయిలో పరిశోధనలు చేపట్టారు. ఆ ముగ్గురిలో ఒకరు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. అభిజిత్ బెనర్జి, మైఖేల్ క్రెమెర్‌, ఎస్తర్ డఫ్లో. ఆర్థశాస్త్రంలో వీరి చేసిన పరిశోధనలకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. అంతేకాదు.. ప్రతిష్టాత్మక నోబెల్ వరించింది.

పరిశోధనలకు ఆఫ్రికాలో అడుగులు

వీరు తమ పరిశోధనకు ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశాన్ని ఎంచుకున్నారు. తమ ఆలోచనలు అత్యంత వెనుకబడ్డ మారుమూల దేశంలో అమలు చేశారు. హైఖేల్ క్రెమెర్ తన మిత్రులతో ఈ అతిపెద్ద సాహాసానికి దిగాడు. ఆరోగ్యం, విద్య బాగుంటే ప్రతి కుటుంబంలో వెలుగులు నిండుతాయని గ్రహించారు. అంతే..పేదరికంలో మగ్గుతున్న కెన్యా కుటుంబాల్లో వెలుగులు నింపారు. దీంతో ఊహించని మార్పులు ఆ కుటుంబాల్లో వచ్చాయి.

ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా ఎదుగుదల

ఇక ఇండియాలోనూ ఇదే ఆర్ధిక నమూనాలు అమలు చేశారు . ఇక్కడ అభిజిత్ బెనర్జి నేతృత్వంవహించాడు. పేదరికంలో మగ్గుతున్నవారికి ఆర్ధికంగా చేదోడుగా ఉన్నారు. కొంతకాలంలోనే లక్షల కుటుంబాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వీరి పరిశోధనలు స్థానిక వనరులను వినియోగించుకుంటూ ముందుకు సాగుతాయి. దీంతో లక్షల మంది జీవితాల్లో పెను మార్పులు వచ్చాయి. దీంతో నోబెల్ ఈ ముగ్గురిని వెతుక్కుంటూ వచ్చింది. అంతేకాదు..వీరి ప్రయోగాల్లో పిల్లల్లో మానసిక పరిపక్వత కూడా వికసించిందని గుర్తించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.