అసలే కోవిడ్-19 వణికిస్తుంటే.. బ్రెజిల్‌లో మరో కొత్త వైరస్‌..

By Newsmeter.Network  Published on  13 Feb 2020 8:13 AM GMT
అసలే కోవిడ్-19 వణికిస్తుంటే.. బ్రెజిల్‌లో మరో కొత్త వైరస్‌..

చైనాలో పుట్టిన కోవిడ్-19 (కరోనా వైరస్) ధాటికి ప్రపంచమంతా వణికిపోతుంది. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా 1335 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ వైరస్‌కు మందు కనిపెట్టడానికి 18 నెలల వరకూ సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా బ్రెజిల్‌లో మరో కొత్తరకం వైరస్‌ను గుర్తించారు. బ్రెజిల్‌లోని బెలో హోరిజోంటేలో ఈ వైరస్‌ను గుర్తించినట్టు తెలిపిన పరిశోధకులు.. ఇలాంటి వైరస్‌ను ఇప్పటి వరకు ఎక్కడ గుర్తించలేదని పేర్కొన్నారు. ఈ వైరస్‌కు బ్రెజిల్‌లో ప్రముఖంగా వినిపించే పురాణ పాత్ర ఐరా..గౌరవార్థం 'యారా'వైరస్‌గా నామకరణం చేశారు.

కొత్త వైరస్‌ను గుర్తించడం పరిశోధకుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో.. కొత్త వైరస్‌ను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తుంది. అయితే.. ఊరట నిచ్చే అంశం ఏమిటంటే.. ఈ వైరస్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీనిపై శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.

Next Story