ఈతకు వెళ్లి 8 మంది విద్యార్థులు మృతి

By సుభాష్  Published on  22 Jun 2020 8:57 AM GMT
ఈతకు వెళ్లి 8 మంది విద్యార్థులు మృతి

చైనాలో విషాదం చోటు చేసుకుంది. నదిలో మునిగి 8 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ చైనా టోంగ్‌జియా ప్రాంతంలో చోటు చేసుకుంది. సరదాగా నదిలో ఈతకొట్టేందుకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలోమునిగి మృతి చెందారు.

చైనాలోని చోంగ్‌ కింగ్‌ నగరం లో ఓ నదిలో ఈతకొట్టేందుకు 8 మంది విద్యార్థులు వెళ్లారు. అయితే అందులో ఓ విద్యార్థి ఈత కొడుతూ మునిగిపోతుండగా, అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ఏడుగురు విద్యార్థులు సైతం నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు, సహాయక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు.

Next Story
Share it