యూకే హైకోర్టులో పాక్ బోర్లా…

లండన్ లోని నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ 70 ఏళ్లనాటి 35 మిలియన్ డాలర్ల నిధి పై భారతదేశ వాదనలను యుకే హైకోర్టు బుధవారం సమర్థించింది.

సెప్టెంబరు 1948 హైదరాబాద్ 7వ నిజాం పాకిస్తాన్ హై కమిషనర్ రహీంతుల్లా ఖాతాలోకి ఒక మిలియం డాలర్ల డబ్బును బదిలీ చేశారు. ఆ నిధిని రాష్ట్ర ప్రయోజనాలకోసం జమచేశారు. అప్పటినుండి పాక్ తన దేశ ప్రయోజనాలకు ఆ నిధిని ఇవ్వాలని 1950 లో కోర్టును ఆశ్రయించింది. దీనిని యుకే హౌస్ ఆఫ్ లార్డ్స్ ఈ చర్యలను పక్కన పెట్టింది.

పాకిస్తాన్ స్వయంగా ఈ చర్యలను 2013లో తిరిగి ప్రారంభించింది. ఈ ధనాన్ని తమకే ఇవ్వాలని, భారత్ తరపు విచారణను నిలిపివేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని యూకే కోర్టు.. దుర్వినియోగ ప్రక్రియ క్రింద తిరస్కరించింది.

70 ఏళ్ళ తరువాత ఈ కేసుపై ఈ రోజు విస్తృత తీర్పును వెలువరించింది. కేసుకు సంబంధించి ఉన్న‌ అన్ని డాక్యుమెంటేషన్ ల‌ను విశ్లేషించి, ట్రస్టుల చట్టాన్ని, విదేశీ రాష్ట్ర చర్యల చట్టాలను మరియు చర్యల పరిమితులను పరిశీలించిన తర్వాత కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ఈ వివాదం పూర్తిగా లేదా పాక్షికంగా న్యాయబద్ధం కాదని పాకిస్తాన్ వాదించిన వాదనలను కోర్టు తిరస్కరించింది. చట్టవిరుద్ధత యొక్క సిద్ధాంతం ఏదో ఒకవిధంగా రికవరీని నిరోధించింది.

ఈ రోజు ఇచ్చిన తీర్పులో.. ఆయుధ రవాణాకు చెల్లింపుగా లేదా పూర్తిగా బహుమతిగా ఫండ్ ఉద్దేశించబడింది అనే పాకిస్తాన్ వాదనను యూకే హైకోర్టు తిరస్కరించింది. 1948 నాటినుండి ఆ ఫండ్‌ యాజమాని 7వ నిజాం దని కోర్టు నిర్ధారించి.. భారత్, నిజాం ఇద్దరు మనవళ్లు అనుభవించడానికి అర్హులు అని కోర్టు తేల్చింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.