74 ఏళ్ల వ్యక్తి తల పై పెరిగిన 'దయ్యం కొమ్ము'..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Sep 2019 9:40 AM GMT
74 ఏళ్ల వ్యక్తి తల పై పెరిగిన దయ్యం కొమ్ము..!

భోపాల్ :మధ్యప్రదేశ్ రాహ్లీ గ్రామానికి చెందిన 74 ఏళ్ల శ్యాం లాల్ యాదవ్ కు కొన్ని ఏళ్ల క్రితం వింత వ్యాధి సోకింది. దీని కారణంగా ఆయన తల మీద కొమ్ము మొలవసాగింది. కొన్ని సంవత్సరాల క్రితం తలకు గాయం అయిన తరువాత నుంచి ఈ కొమ్ము మొలవడం మొదలయింది . కొద్ది రోజులకి పెద్దదవడంతో శ్యాం లాల్ యాదవ్ భయపడ్డాడు. అలవాటై తనే దానిని కత్తిరించేవాడనీ, కానీ అది బాగా పెద్దదవడంతో డాక్టర్లని సంప్రదించి ఎదైనా పరిష్కారం ఇమ్మని కోరాననీ, శ్యాం లాల్ చెప్పారు.

చివరకు సాగర్ భాగ్యోదయ్ తీర్థ్ ఆసుపత్రి లో ఈ కొమ్ము ని తొలగించారు. డాక్టర్లు శ్యాం లాల్ కు సెబసియస్ హార్న్ అనే వింత జబ్బు తో బాధ పడుతున్నాడని. ఈ జబ్బు చర్మం పైన మోతాదు కంటే అధికంగా సూర్య రశ్మి పడడం వల్ల వస్తుందనీ, దీనిని దయ్యం కొమ్ము అని కూడా అంటారనీ వివరించారు.

మొలిచిన కొమ్మును ఎక్స్రే (X-ray) తీయగా దాని మూలాలు లోపలి వరకూ వెళ్లని కారణంగా ఆపరేషన్ చేసి దానిని తొలగించామనీ, ఇది ఎంతో అరుదైన జబ్బని, డాక్టర్ విషాల్ గజ్భియే వివరించారు.

అరుదైన సర్జరీ కావడం వల్ల, ఈ సర్జరీ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ లో చోటు దక్కించుకుంది.

Next Story
Share it