ఆవు కడుపులో 52 కేజీల ప్లాస్టిక్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 6:18 AM GMT
ఆవు కడుపులో 52 కేజీల ప్లాస్టిక్..!

ప్లాస్టిక్ మూగజీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. పాలిచ్చే గోమాతను సైతం ప్లాస్టిక్ భూతం తినేస్తోంది. తమిళనాడు వెటర్నరీ, అనిమల్ సైన్సెస్ యూనివర్సిటీ వైద్యులు ఆవు కడుపులో ఉన్న యాభై రెండు కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. ఈ సర్జరీ చేయడానికి వారికి సుమారు ఐదున్నర గంటల సమయం పట్టింది. తమిళనాడుకు చెందిన మునిరత్నం తన ఆవుకు ఏదో అనారోగ్యం ఉందని గుర్తించాడు. మేత తినే విషయంలోను, పాడిలో కూడా తేడా ఉన్నట్టు తెలుసుకున్నాడు. అంతే కాకుండా ఆవు బాధాకరంగా మూలుగుతూ తన కడుపును తన్నుకోవడంతో అనుమానం వచ్చిన మునిరత్నం ఆవును వెటర్నిటీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. వివిధ రకాల పరీక్షలు చేసిన అనంతరం ఆవుకు సర్జరీ చేయడానికి నిర్ణయించారు.

Plastic1

ముగ్గురు డాక్టర్ల బృందం ఐదున్నర గంటల పాటు చేసిన ఈ సర్జరీలో యాభై రెండు కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలను గుర్తించి తొలగించారు. వీటితో పాటు రెండు స్క్రూలు ఒక కాయన్ కూడా బయటకు తీశారు. ఆవు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని సూచించారు.

Plastic 2

Next Story
Share it