టెన్షన్.. టెన్షన్.. 44 లక్షలకు కరోనా కేసులు

By సుభాష్  Published on  14 May 2020 4:45 AM GMT
టెన్షన్.. టెన్షన్.. 44 లక్షలకు కరోనా కేసులు

కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 44,25,700 మంది కరోనా కేసుల బారిన పడ్డారు. ఇక మృతుల సంఖ్య ను పరిశీలిస్తే 3లక్షలకు చేరువలో ఉంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200లకుపైగా దేశాలకు వ్యాపించింది. మృతులను వెంటాడుతోంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేని కారణంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 3లక్షలకు చేరువగాలో ఉండగా, 45వేలకుపైగా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాను సైతం వెంటాడుతోంది. మొదటి మృతుల సంఖ్యలో, పాజిటివ్‌ సంఖ్యలో చైనాలో మొదటి స్థానంలో ఉండగా, ఇటలీ రెండో స్థానంలో ఉండేది. కాని ఆ స్థానాన్ని అమెరికా దాటేసింది. ప్రస్తుతం అమెరికాలో కరోనా తీవ్ర తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బుధవారం ఒక్క రోజే కొత్తగా 21,712 కేసులు నమోదు కాగా, 1772 మంది మృతి చెందారు. ఇక అమెరికాలో 85,198 మంది మృతి చెందినట్లు లెక్కలు చెబుతున్నాయి.

కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు సైతం ఎన్నో చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనాను కట్టడి చేసుందుకు సామాజిక దూరం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచిస్తోంది. ఇలా పాటించకపోతే మున్ముందు మరింత ప్రమాదం పొంచివుండే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. ఈ మహమ్మారిని అంత చేసేందుకు వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచ దేశాలు సైతం తలమునకలవుతున్నాయి. భారత్‌లో కూడా ఈ వ్యాక్సిన్‌ తయారీ దశలో ఉంది. ఇప్పటికే ఎలుకలపై, కోతులపై ప్రయోగించిన సక్సెస్‌ అయిన భారత్‌.. ఇక కరోనా బాధితులపై ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది కనుక విజయవంతమైతే కరోనా వ్యాక్సిన్‌ వచ్చినట్లేనని తెలుస్తోంది. ఇక ప్రపంచ దేశాలు సైతం కూడా అంతే వ్యాక్సిన్‌ తయారీలో ఎంతో శ్రమిస్తున్నాయి.

Next Story