ముఖ్యాంశాలు

  • 82 మంది మ్మెల్యేల్లో 41 మందిపై క్రిమినల్ కేసులు

  • నామినేషన్ దాఖలు సమయంలో బయటపడ్డ కేసులు

జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలు గత సోమవారం విడుదలైన విషయం తెలిసిందే. కొన్నిగా ఎన్నికైన 81 ఎమ్మెల్యేలలో 41 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులున్నట్లు తేలింది. 2019 జార్ఖండ్‌ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన సమయంలో ఇచ్చిన పత్రాల ఆధారంగా ఈ కేసును బయటకు వచ్చాయి. ముక్తి మోర్చా ఎమ్మెల్యేలైన 30 మందిపై క్రిమినల్‌కేసులుండగా, 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 8 మందిపై క్రిమినల్‌ కేసులున్నట్లు తేలింది. అలాగే 25 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 11 మందిపై ఈ కేసులున్నట్లు తెలుస్తోంది. 2014 జార్ఖండ్‌ ఎన్నికల్లో 81 మంది ఎమ్మెల్యేల్లో 55 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

ఈ విషయమై కాంగ్రెస్‌ ప్రతినిధి అలోక్‌ దుబే, జేఎంఎం నాయకుడు బబ్లూపాండే స్పందిస్తూ, ఒక వ్యక్తి దోషిగా తేలే వరకు ఎన్నికల్లోపోటీ చేసే హక్కును కోల్పోలేరని చెప్పుకొచ్చారు. అలాగే ఏడీఆర్‌ రాష్ట్ర కన్వీనర్‌ మాట్లాడుతూ.. జార్ఖండ్‌ ప్రజలు తమ ప్రతినిధులకు నేరపూరిత నేపథ్యంలో ఉందనే విషయం సరైన అవగాహణ లేదని చెప్పారు. ప్రజలు కోరుకుంటున్నది వారి సమస్యలను పరిష్కరించడమేనని, ఇలాంటివి ఓటర్లు పట్టించుకోరని అన్నారు.

53 మంది కోటీశ్వరులు:

ఏడీఆర్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జార్ఖండ్‌ ఎన్నికల్లో 81 మంది ఎమ్మెల్యేలలో 53 మంది కోటీశ్వరులు ఉన్నారని తెలుస్తోంది. ఈ జాబితాలో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామేశ్వర్‌ , బీజేపీకి చెందిన భాణ ప్రతాప్‌, పలువురు నాయకుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.