భారీ వైమానిక దాడి.. 28 మంది సైనికులు మృతి

By సుభాష్  Published on  5 Jan 2020 8:01 AM GMT
భారీ వైమానిక దాడి.. 28 మంది సైనికులు మృతి

లిబియా రాజధానిలో భారీ వైమానిక దాడి జరిగింది. ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో 28 మంది సైనికులు మృతి చెందగా, చాలా మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి జరిగిన సమయంలో క్యాడెంట్లంతా మైదానంలో పెరేడ్‌ కోసం రెడీ అవుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గత ఏప్రిల్‌ నుంచి తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ దేశాన్ని పాలించిన నియంత గడాఫీని నాటో దళాలు 2011లో గద్దె దించి హతమర్చిన నాటి నుంచి లిబియాలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. తాజాగా జరిగిన దాడి ఎవరు చేశారన్న క్లారిటీ రాలేదు. ఈ దాడికి సంబంధించిన వివరాలను జీఎన్‌ఏ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి అమిన్‌ అల్‌ హషేమి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడిని ధృవీకరించామని, ఈ ఘటనలో 28 మంది చెందగా, 12 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన సైనికులకు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మిలటరీ పాఠశాల ట్రిపొలి కేంద్రంగా అల్‌ -హద్బా అల్‌ -ఖాద్రాలో ఉంది.

Next Story