ఆగకుండా పరుగులు పెడుతున్న బంగారం ధర

By సుభాష్  Published on  18 May 2020 11:30 AM GMT
ఆగకుండా పరుగులు పెడుతున్న బంగారం ధర

పసిడి పరుగులు పెడుతోంది. ఇటీవల బ్రేకులు పడ్డ బంగారం.. ఇప్పుడు ఆగకుండా దూసుకెళ్తోంది. కాగా, యూఎస్‌-చైనాల కారణంగా భారీగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయి.

తాజా ధరలను చూస్తుంటే 50వేలకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. సోమవారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ. 45,490

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ. 48,560

కిలో వెండి ధర - రూ. 46,730

దేశ రాజధాని ఢిల్లీలో..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ. 46,210

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - రూ. 48,520

కిలో వెండి - రూ. 46,790

కాగా, బంగారం ధర పెరిగితే వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ అధికం కావడంతో ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. కరోనా మహ్మారి కారణంగా అమెరికా-చైనా మధ్య నెలకొంటున్న వివాదాలు, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావంచ చూపుతున్నాయి.

Next Story