తెలంగాణ‌లో పెరిగిన పాజిటివ్ కేసులు.. కొత్త‌గా 22

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 30 April 2020 9:35 PM IST

తెలంగాణ‌లో పెరిగిన పాజిటివ్ కేసులు.. కొత్త‌గా 22

రెండు, మూడు రోజులుగా తెలంగాణ‌లో త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఒక్క‌సారిగా పెరిగాయి. నేడు ఒక్క రోజే కొత్త‌గా 22 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. ముగ్గురు మ‌ర‌ణించిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,038కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 28 మంది మ‌ర‌ణించారు.

మొత్తం న‌మోదైన కేసుల్లో ఇప్ప‌టి వ‌రకు 442 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా.. ప్ర‌స్తుతం 568 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

22 New coronavirus cases in Telangana

Next Story