2021 జాతీయ జనాభా లెక్కల సేకరణపై సమీక్ష

By అంజి  Published on  2 Dec 2019 3:16 PM GMT
2021 జాతీయ జనాభా లెక్కల సేకరణపై సమీక్ష

2021 జాతీయ జనాభా లెక్కల సేకరణకు సంబందించి తెలంగాణలో 71163 ఎన్యుమరేటర్లు ద్వారా జనాభా లెక్కలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె. జోషి బి.ఆర్.కె.ఆర్ భవనంలో నిర్వహించిన సమీక్షలో తెలిపారు. జనాభా లెక్కలు సంబందించి ఇప్పటివరకు మొదటివిడతగా 65 మంది మాస్టర్ ట్రైనీలకు ఎం.సి.ఆర్. హెఛ్.ఆర్.డి.లో శిక్షణ ఇవ్వడం జరిగిందని. రెండవవిడతగా డిసెంబర్ 2 నుండి 7 వ తేదీ వరకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందని. అదేవిధంగా జనవరి 2020 లో దాదాపు 2000 మంది ఫీల్డ్ ట్రెనిలకు మాస్టర్ ట్రెనిలకు శిక్షణ ఇస్తామన్నారు. వీరు ఎన్యూమరేటర్లకు సూపర్ వైజర్లకు ఏప్రిల్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

జనాభా లెక్కల సేకరణలో భాగంగా హౌస్ లిస్ట్, హౌస్ సెన్సస్ , పాపులేషన్ ఎన్యూమరేషన్ లతో పాటు నేషనల్ పాపులేషన్ రిజిష్టరును అప్ డేట్ చేస్తామని చెప్పారు . ఈ లెక్కల వలన వ్యక్తుల వివరాలతో పాటు సోషల్, కల్చరల్, డెమోగ్రపిక్, ఆర్థిక వివరాలను సేకరించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. జనాభా లెక్కల సేకరణ మొబైల్ యాప్, పేపర్ షెడ్యూల్ ద్వారా సేకరిస్తారని అదేవిధంగా ఎన్యూమరేషన్ బ్లాకులుగా ఏర్పాటు చేసి ఇంచార్జ్లను ఏర్పాటు చేస్తామన్నారు. డైరెక్టర్ అఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ కె.ఇలంబర్తి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను కమిటీకి వివరించారు.

ఈ జనాభా లెక్కలు గ్రామాల, పట్టణాలకు సంబందించిన ప్రైమరీ సోర్సెస్ గా విద్య ,వైద్య, బాష,ఆర్థిక, డెమోగ్రఫిని తదితర వివరాలను తెలియచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతేక్య ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, శాంతి కుమారి, అందర్ సిన్హా, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి శివశంకర్, డైరెక్టర్ అఫ్ సెన్స్ ఆపరేషన్ ఇలంబర్తి, జి,హెఛ్.యం.సి. కమీషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story