2020 బడ్జెట్ లో దిగుమతులపై పడనున్న పన్ను భారం

By రాణి  Published on  25 Jan 2020 1:25 PM GMT
2020 బడ్జెట్ లో దిగుమతులపై పడనున్న పన్ను భారం

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి కేంద్రం ఆదాయాన్ని పెంచే దిశగా కేంద్రం బడ్జెట్ లో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు, ఉద్యోగాల కల్పన, దేశీయ తయారీలపై దృష్టిసారించింది కేంద్ర ప్రభుత్వం. అయితే దాదాపు 50 కిగై వస్తువులపై దిగుమతి పన్నులు పెంచనున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లపై కూడా ఈ పన్నుభారం తప్పందంటున్నారు నిపుణులు. చాలా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు ఛార్జర్లు, ఇతర మొబైల్ భాగాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఐకియా వంటి రిటైల్ సంస్థలు కూడా చాలా వరకూ ఎలక్ర్టానిక్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే దిగుమతి వస్తువులపై పన్నులు పెంచితే ఆ భారం దేశంలో ఉన్న పలు కంపెనీలపై పడనుందని నిపుణులు చెప్తున్నారు.

ఎలక్ర్టానిక్స్, ఎలక్ర్టిక్ ఉత్పత్తులు, రసాయనాలు, హస్తకళలు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, పరిశ్రమల రసాయనాలు, విద్యుత్ దీపాలు, కర్రతో చేసిన ఫర్నిచర్, క్యాండిల్స్, ఆభరణాలు ఇలా తదితర వస్తువులపై పన్నుభారం తప్పేలా లేదని తెలుస్తోంది. ఏదేమైనా బడ్జెట్ ప్రకటనతోనే ఒక క్లారిటీ వస్తుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టాకే..ఏఏ వస్తువులపై పన్నుభారం ఎక్కువగా పడుతుందో తెలుస్తుంది.

Next Story