2019లో విజయాన్ని అందుకోలేకపోయిన తెలుగు సినిమాలివే..

By సుభాష్  Published on  30 Dec 2019 4:33 PM IST
2019లో విజయాన్ని అందుకోలేకపోయిన తెలుగు సినిమాలివే..

2019లో వచ్చిన సినిమాలన్ని కొన్ని హిట్‌ అయ్యాయి. కొన్ని ప్లాప్‌ అయ్యాయి. భారీ విజయం సాధిస్తాయనుకున్న సినిమాలు చివరకు ప్లాప్‌ అయ్యాయి. ఈ ఏడాది మొదటి నుంచి స్టార్‌ హీరోల సినిమాలు నిరాశ కలిగించాయి. కాగా, ఈ ఏడాది కమర్షియల్‌లో పెద్దగా డిజాస్టర్‌లుగా మిగిలిన తెలుగు మూవీస్‌ ఇవే..

ఎన్టీఆర్‌ కథానాయకుడు

నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూ తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్‌ కథానాయకుడు. ఈ సినిమా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందింది. ఈ మూవీకి మంచి రివ్యూ వచ్చినప్పటికి పెద్దగా కలెక్షన్‌ని రాబట్టలేకపోయింది.

వినయ విదేయరామ

ఇండస్ట్రీలో హిట్‌ సాధించిన రామ్‌చరణ్‌. మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ చిరునామాగా ఉన్న దర్శకుడు బోయపాటి సినిమా అంటే విజయం సాధించాల్సిందే. కానీ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విదేయరామ సినిమా ప్లాప్‌ అయింది. చరణ్‌కు ఎన్నో సినిమాలు మంచిపేరు తీసుకురాగా, ఈ సినిమా మాత్రం నిరాశ మిగిల్చిందనే చెప్పాలి.

మిస్టర్‌ మజ్ను

మిస్టర్‌ మజ్ను చిత్రం పర్వాలేదనిపించినా...ఫెయిల్‌ అయిపోయింది. తొలిప్రేమ, వంటి సూపర్‌ హిట్‌ అందించిన వెంకీ అల్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా హిట్‌ కొడుతుందని ముందుగా భావించినా నిరాశ పర్చింది. ఈ మూవీ కూడా డిజాస్టర్‌ గా మిగిలిపోయింది.

ఎన్టీఆర్‌ మహానాయుడు:

మొదటి భాగం తెరకెక్కించిన ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమాతో హిట్‌ కొట్టేసి ఎన్టీఆర్‌ పరువు నిలబెట్టాలనికుని, రెండో భాగం కూడా తెరకెక్కించిన సినిమా ఎన్టీఆర్‌ మహానాయకుడు. ఈ చిత్రం కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది. క్రిష్‌, బాలకృష్ణలు ఈ సినిమాతో మంచి పేరు తీసుకువస్తారనుకుంటే చివరకు డిజాస్టర్‌ అయింది.

వేర్‌ ఈజ్‌ ది వెంకట లక్ష్మీ:

బాలీవుడ్‌ లో రాణించలేకపోయిన రాయ్‌ లక్ష్మీ.. ఈసారి అయిన విజయం అందుకుంటుంది అనుకుంటే ప్లాప్‌ అయిపోయింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మీ చిత్రం కూడా నిరాశపర్చింది.

సూర్యకాంతం:

మొదటి సినిమా నుంచి ఓ హిట్‌ కోసం ఎంతో ఆశపడుతున్న మెగా కుటుంబంలోని నిహారికకు సూర్యకాంతం మూవీ నిరాశ పర్చింది. మొదటి సినిమా కూడా ప్లాప్‌ కాగా, ఈ సినిమా కూడా తీవ్ర నిరాశ పర్చిందనే చెప్పాలి

ప్రేమకథాచిత్రం2:

ప్రేమ కథా చిత్రం2 చిన్న సినిమాగానే ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా రాణించలేకపోయిందనే చెప్పాలి. ఈ చిత్రానికి సీక్వెల్‌ గా వచ్చిన ప్రేమ కథా చిత్రం 2 ఏ మాత్రం జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ చివరకు డిజాస్టర్‌ అయింది.

ఏబీసీడీ:

అల్లు శిరీష్‌ హీరోగా నటించిన చిత్రం ఏబీసీడీ. ఈ చిత్రం పెద్దగా హిట్‌ కాలేకపోయింది. శిరీష్‌ కెరీర్‌ కు బూస్టప్‌ ఇస్తుందని అందరూ భావించినా.. తీవ్ర నిరాశ మిగిల్చిందనే చెప్పాలి.

సీత:

తేజ దర్శకత్వంలో కాజల్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా సీత. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్లతో ఎన్నో అంచనాలు క్రియేట్‌ చేసింది. కానీ ఈ సినిమాలో పెద్దగా స్టోరీ లేకపోవడంతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

కల్కి:

పీఎస్‌వి గరు వేగ సినిమాతో హిట్‌ సాధించి, మళ్లీ ఫాంలోకి వచ్చిన రాశశేఖర్‌ సినిమా నిరాశ పర్చిందనే చెప్పాలి. చివరకు ఈ సినిమా నిరాశ పర్చింది. 'అ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాలో మితిమీరిన యాక్షన్‌ సన్నివేశాలు చూపించడంతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

డియర్‌ కామ్రేడ్‌ :

విజయ్‌ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్‌ గా నటించిన చిత్రం డియర్‌ కామ్రేడ్‌. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భరత్‌ కమ్మా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనాలు తిప్పి కొట్టారు.

కథనం:

కథనం సినిమా బుల్లి తెరపై ఎంతో పేరుతెచ్చుకున్న అనసూయ.. ఈమె సొగ్గాడే చిన్ని నాయన, క్షణం, రంగస్థలం, ఎఫ్‌ 2 వంటి సినిమాలు నటించగా, తర్వాతవచ్చిన కథనం సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు.

మన్మధుడు 2:

కింగ్‌ నాగార్జున నటించిన మన్మధుడు సీక్వెల్‌తో వచ్చిన మన్మధుడు 2. ఈ సినిమా పెద్దగా హిట్‌ కాలేకపోయింది. చిలసౌ మూవీతో నేషనల్‌ అవార్డు అందుకున్న డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రకు ఈ సినిమా నిరాశ మిగిల్చిందనే చెప్పాలి.

రణరంగం :

శర్వానంద్‌ టైం ఈ మధ్యన అస్సలు బాగున్నట్లు కలిసి రావడం లేదు. గత సంవత్సరం పడి పడి లేచె మనసు, ఈ సంవత్సరం రణరంగం చిత్రాలతో పెద్ద డిజాస్టర్లను అందుకున్నాడనే చెప్పాలి

సాహో :

బాహుబలి సిరీస్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన మూవీ సోహో. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. చివరకు నిరాశ మిగిల్చింది. పెద్దగా హిట్‌ కాలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం జనాలను ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా.. బాలీవుడ్‌లో మాత్రం పెద్ద హిట్‌ కొట్టేసింది.

చాణక్య:

కొంత కాలంగా ప్లాపులతో ఇబ్బందులు పడుతున్న గోపిచంద్‌ ఈ సారి మంచి విజయం తన ఖాతాలో వేసుకోవాలని ఆరాటపడుతూ.. చాణక్య చిత్రంలో నటించారు. చివరకు ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న గోపిచంద్‌కు ఈ సినిమా నిరాశ మిగిల్చిందనే చెప్పాలి.

ఆర్‌డీఎక్‌ లవ్‌ :

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న పాయల్‌... ఆర్‌డీఎక్స్‌ లవ్‌ మూవీ డిజాస్టర్‌ గా మిగిలిపోయింది.

ఆవిరి :

క్రియేటివ్‌ డైరెక్టర్‌ రవిబాబు తెరకెక్కించిన సినిమా 'ఆవిరి'. ఈ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేరనే చెప్పాలి. దీంతో ఈ సినిమా డిజాస్టర్‌ గా మిగిలిపోయింది.

దేవ్‌ :

కార్తీ సినిమాలకు తెలుగులో మంచి క్రేజే ఉందని చెప్పాలి. కానీ 'దేవ్‌' సినిమా మాత్రం జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. కానీ ఈ సినిమా ప్లాప్‌ అయినా.. ఖైదీ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు.

బందోబస్తు :

సూర్య, మోహన్‌ లాల్‌, ఆర్య వంటి స్టార్లు నటించిన చిత్రం 'బందోబస్తు'. తెలుగులో కూడా వీళ్లకు మంచి క్రేజే ఉన్నా.. ఈసినిమాను మాత్రం పెద్దగా ఆదరించలేకపోయారు. పెద్ద డిజాస్టర్‌ గా మిగిలిపోయింది.

రాగాల 24 గంటల్లో..

హీరోయిన్‌ ఈషారెబ్బా నటించిన చిత్రం రాగాల 24 గంటల్లో. ఈ నటికి మంచి క్రేజ్‌ ఉంది. ఈ సినిమా విడులకు ముందు ఎంతో ప్రమోషన్‌ వర్క్‌ చేశారు. ఇండస్ట్రీలో హీరో సత్యదేవ్‌ కూడా మంచి సినిమాలు చేస్తాడనే నమ్మకం ఉంది. కానీ వీళ్లిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా మాత్రం కనీస వసూళ్లను రాబట్టలేకపోయింది.

Next Story