అమ్మాయి ముందు అలా కూర్చోవడం పద్ధతి కాదు : పవన్ కు రేణు స్వీట్ వార్నింగ్
By రాణి Published on 20 April 2020 11:53 AM IST- బద్రి కి 20 ఏళ్లు..షూటింగ్ స్పాట్ ఫొటోలు షేర్ చేసిన రేణుదేశాయ్
బద్రి..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరియర్ ను మలుపుతిప్పిన సినిమా. ఈ సినిమా వచ్చి ఏప్రిల్ 20 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. బద్రి సినిమా వచ్చి అప్పుడే 20 ఏళ్లు గడిచిపోయిందంటూ ఆ సినిమా హీరోయిన్ రేణు దేశాయ్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో తీసిన ఫొటోలను రేణు ఇన్ స్టా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. అలా షేర్ చేసిన ఒక ఫొటోలో పవన్ కల్యాణ్ రాతిపై కూర్చొని ఉండగా రేణు దేశాయ్ నిలబడి పవన్ మాటలు వింటున్నట్లుగా ఉంది.
Also Read : ఆన్ లైన్ లో అక్షయ తృతీయ
'' షూటింగ్ సమయంలో వచ్చిన కొద్దిసేపు ఖాళీలో మాకు కూర్చునేందుకు కుర్చీలు లేవు. అయినా నేను షార్ట్ లో ఉండటం వల్ల కుర్చీలు ఉన్నా కూర్చోలేకపోయాదాన్ని. ఆ సమయంలో కల్యాణ్ అక్కడున్న రాతిపై కూర్చునుండగా..ఒక అమ్మాయి ఇలా నిలబడి ఉండగా మీరు అలా కూర్చోవడం మంచి పద్ధతి కాదంటూ నేను జోక్ చేస్తుండగా తీసిన ఫొటో ఇది'' అని రేణు ఇన్ స్టా లో పేర్కొన్నారు.
'' మరొక ఫొటో షూటింగ్ ప్యాకప్ తర్వాత ఇద్దరం అలసిపోయి ఉండగా తీసిన ఫొటో. పవన్ కల్యాణ్ చికిత పాట చిత్రీకరణ, నేను వరమంటే..శాడ్ సాంగ్ చిత్రీకరణ అయిపోయాక బాగా అలసిపోయాం. ఆ షూటింగ్ స్పాట్ కు వెళ్లేందుకు చాలా దూరం నడిచాం. అందుకే అలసిపోయి మా ప్రపంచాలను మరిచిపోయి అలా ఆకలితో, అలసటతో కూర్చుని ఉన్నాం..'' అని టాగ్ చేశారు రేణు దేశాయ్.