విమానంలో వెళ్లిన 19 మంది భారతీయలకు కరోనా

By సుభాష్  Published on  3 Nov 2020 4:35 AM GMT
విమానంలో వెళ్లిన 19 మంది భారతీయలకు కరోనా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కాస్త తగ్గముఖం పట్టిన వైరస్‌ మళ్లీ మెల్ల మెల్లగా విజృంభిస్తోంది. దాదాపు మూడు నెలల పాటు లాక్‌ డౌన్‌ విధించడంతో కట్టడిలో ఉన్న కరోనా అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో మళ్లీ వైరస్‌ వ్యాప్తి ఎక్కువైపోయింది. ఈనెల 13 నుంచి చైనాకు మరో నాలుగు విమానాలను నడిపేందుకు సిద్ధమవుతున్నట్లు సోమవారం ప్రకటించింది భారత్‌. తాజాగా న్యూ ఢిల్లీ నుంచి చైనా నగరం వుహాన్‌కు వందేభారత్‌ మిషన్‌ విమానంలో 19 మంది భారతీయ ప్రయాణికులు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.వందే భారత్‌ మిషన్‌లో భాగంగా అక్టోబర్‌ 30న వుహాన్‌ నగరానికి వెళ్లింది. ఆ విమానంలో 19 మందికి పాజిటివ్‌ తేలింది. మరో 39 మంది యాంటీబాడీలు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే నవంబర్‌ 13 నుంచి మరో నాలుగు విమానాలు వుహాన్‌కు నడపాలని భావిస్తున్న కేంద్రం ప్రకటించగానే ఈ పాజిటివ్‌ కేసులు బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

నవంబర్‌ 13, 20,27, డిసెంబర్‌ 4వ తేదీల్లో ఎయిర్‌ ఇండియా యోచిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలో విమానంలో 19 మమందికి పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా వైరస్‌ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. వైరస్‌ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు తుది దశలో ఉండగా, మరికొన్ని ట్రయల్స్‌లో కొనసాగుతున్నాయి. కాగా, వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరి నాటికి వస్తుందని అధికారులు చెబుతున్నా.. వచ్చే అవకాశాలేమి కనిపించడం లేదు. ఇక భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది మార్చి వరకు విడుదలయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రకటించింది.

Next Story