ఆర్టీసీ కార్మికుల సమ్మె 18 వ రోజుకు చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా డిపోల ముందు కార్మికులు ధర్నాకు దిగారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు 18 రోజులుగా ధర్నా చేస్తున్నారు. జేబీఎస్‌లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు వంటావార్పు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి అఖిల పక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీజేఎస్‌, జనసేన నేతలు కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. కరీంగనగర్‌ డిపోలో ఆర్టీసీ కార్మికులు ఉదయమే నిరసనకు దిగారు. డిపో నుంచి తాత్కాలిక డ్రైవర్లు బస్సులు తీయడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట ఆర్టీసీ సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్సు అద్దాలను ఆర్టీసీ కార్మికులు ధ్వంసం చేశారు.

ప్రభుత్వం దిగివచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మికులు అంటున్నారు. బస్సుపై నుంచి కిందకి దుకడానికి ఆర్టీసీ కార్మికుడు ప్రయత్నించాడు. మరో వైపు జగిత్యాల జిల్లాలో ఓ ఆర్టీసీ కార్మికుడు తనపై దాడి చేశాడంటూ తాత్కాలిక డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను దాడి చేయలేదని ఆర్టీసీ కార్మికుడు పోలీసులకు వివరణ ఇచ్చుకున్నాడు. ఏది ఏమైనా సమ్మె ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గంటల తరబడి వెయిట్‌ చేసినా బస్సులు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కాలేజీకి సమయానికి చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వానికి ఆర్డర్‌ కాపీని పంపింది. ఆర్డర్‌ కాపీ ప్రభుత్వానికి చేరింది. దీంతో ఆర్డర్‌ కాపీపై సీఎం కేసీఆర్‌ చర్చించే అవకాశాలున్నాయి.

Hicourt1 Hicourt2 Hicourt3

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.