1638 కిలోల గంజాయి పట్టివేత.. అరటి గెలల్లో తరలిస్తూ..
By సుభాష్ Published on 27 Feb 2020 8:28 PM IST
విశాఖలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 1638 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు.. పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నట్లు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటలిజెన్స్ కు అందిన సమాచారం ప్రకారం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 40 సంచుల్లో 800 బ్రౌన్ ప్యాకెట్లలో గంజాయిని తరలిస్తుంగా పట్టుకున్నారు.
కాగా, వాహనాల్లో అరటి గెలలలో దాచి ఈ గంజాయిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గంజాయిని విశాఖ నుంచి భువనేశ్వర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిపై 11985 చట్టం ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ గంజాయి విలువ 2.45 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు రెండు వాహనాలను సీజ్ చేశారు.