కృష్ణాజిల్లా: గన్నవరంలో భారీ చోరీ జరిగింది. పార్కింగ్‌లో ఆగిఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసిన దొంగలు..అందులో వున్న రూ.16 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. తన డబ్బు చోరీకి గురైనట్టు గుర్తించిన బాధితుడు సిలార్‌.. గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటన అంతరాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే దొంగలు మూడు కార్లు అద్దాలు పగలకొట్టి డబ్బు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story