తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రో 15 కేసులు.. ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2020 3:17 PM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా మ‌రో 15 కేసులు.. ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బుధ‌వారం కొత్త‌గా 15 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కొత్త కేసుల‌తో క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 943కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 24 మంది చెందారు. మొత్తం న‌మోదైన కేసుల్లో 194 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కాగా.. 725 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు న‌మోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 10 కేసులు న‌మోదు కాగా.. సూర్యాపేట జిల్లాలో 3, గ‌ద్వాల జిల్లాలో 2 కేసులు న‌మోద‌య్యాయి.

క్వారంటైన్ గ‌డువు పెంపు..

ఇక క‌రోనా క‌ట్ట‌డిని చేసే చ‌ర్య‌ల్లో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హోం క్వారంటైన్ గ‌డువును 14 నుంచి 28 రోజుల‌కు పెంచింది. ప్ర‌స్తుతం ఉన్న గ‌డువులో కొంద‌రి ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌డం లేద‌ని కానీ.. ఆ త‌రువాత కొద్ది రోజుల్లోనే పాజిటివ్‌గా వ‌స్తున్నాయ‌ని ప్రభుత్వం గ్రహించింది. దీంతో కరోనా అనుమానితులు ఇక నుంచి 28 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇష్టానుసారం టెస్టులు నిర్వహించవద్దని సూచించింది. ప్రధానంగా ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా కేసులు ఎక్కువ అవుతున్నాయని నిర్ధారించింది. దీంతో ప్రైమరీ కాంటాక్ట్ కేసులకు పరీక్షలు చేయాలని, సెకండరీ కాంటాక్ట్ లకు టెస్టులు అవసరం లేదని తెలిపింది. వీరికి హోం క్వారంటైన్ సరిపోతుందని తెలిపింది.



Next Story