కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌  విధించడంతో తమతమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇంట్లో కబుర్లు చెప్పుకొంటూ కొందరుంటూ మరి కొందరు ఉద్యోగ రీత్యా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసుకుంటూ ఉండిపోయారు. ఇక పిల్లలైతే ఎంతో ఎంజాయ్‌ చేసేశారు. చాలా మంది పిల్లలు తమ సమయాన్ని సైతం వృధా చేసుకుంటుంటే.. మరి కొంత మంది పిల్లలు మాత్రం తల్లిదండ్రుల సాయంతో మెదడుకు పదును పెట్టారు. ఏవేవో కొత్త కొత్తవి తయారు చేసుకుంటూ గడిపేస్తున్నారు.

కొంత మంది పిల్లలు ప్రయోగాలు చేస్తూ ఔరా.. అనిపించుకుంటున్నారు. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడటంతో పాఠాలు మాత్రమే వినలేకపోతున్నారు గానీ.. మెదడుకు పదును పెట్టేస్తున్నారు. తాజాగా కేరళలోని త్రిస్సూరుకు చెందిన చెందిన 12 ఏళ్ల పిల్లోడు తయారు చేసిన రైలు ప్రాజెక్టు రైల్వేమంత్రిత్వశాఖను ఆకట్టుకుంది. అతని పేరు అద్వైత్‌ కృష్ణ. 7వ తరగతి చదువుతున్నాడు. ఈ రైలు తయారు చేయడానికి పెద్దగా ఖర్చు అవసరం లేదు. వస్తువులను ఉపయోగించే తయారు చేశాడు. ఇంట్లో ఉన్న న్యూస్‌పేపర్‌, గ్లూ ఉంటే సరిపోతుంది. ఇక అన్నింటికి మించి ఓపక ఉంటే సరిపోతుంది అంటున్నాడు అద్వైత్‌ కృష్ణ. కేవలం మూడు రోజుల్లోనే 33 వార్త పత్రికలు, ఏ4 షీట్ల పది ఉపయోగించి అద్భుతమైన రైలును తయారు చేశాడు. (ఇది చదవండి: ఆగస్ట్‌ 12 వరకు రైళ్లు రద్దు: రైల్వేశాఖ)

లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉంటూ ఇలాంటి ప్రాజెక్టులు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే రైలును తయారు చేస్తున్నవీడియోతో పాటు ప్రాజెక్టు గురించి కొన్ని విషయాలను వివరిస్తూ రైల్వే మంత్రిత్వశాఖ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. షేర్‌ చేసిన కొద్ది క్షణాలకే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ పిల్లోడు చేసిన ప్రాజెక్టుకు మంత్రిత్వశాఖతో పాటు పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *