ప్ర‌భాస్ ని పూర్తిగా మార్చేసిన ‘సాహో’ ఫెయిల్యూర్. ఏంటా.. మార్పు..?

‘బాహుబ‌లి’ సినిమాతో దేశ వ్యాప్తంగానే కాకుండా అంత‌ర్జాతీయ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ‘సాహో’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి అయితే… ఇందులో ఆశించిన స్ధాయిలో క‌థ లేక‌పోవ‌డం… తెలుగు న‌టులు కాకుండా ఎక్కువుగా బాలీవుడ్ న‌టులే ఉండ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది.

Image result for sahoo prabhas

అందువల్ల ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం ‘జాను’ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. ‘జాను’ మూవీ పీరియడ్ రొమాంటిక్ డ్రామా. ఈ మూవీలో తెలుగు నటులుకు ప్రాధాన్య‌త ఇవ్వాలి అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే విల‌న్ పాత్ర కోసం జగపతి బాబును సంప్రదించినట్లు స‌మాచారం. ‘జిల్’ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Image result for director radha krishna

ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 20 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి వ‌చ్చాకా… నవంబర్‌లో కొత్త షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభిస్తారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2020 సమ్మర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ప్ర‌భాస్ లో వ‌చ్చిన ఈ మార్పు మంచిదే. మ‌రి… ప్ర‌భాస్ ఈసారైనా ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

Image result for prabhas puja hegde

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.