కేబినెట్ భేటీలో ఆర్టీసీకి ఎండ్‌కార్డు ఇస్తారా..?
By అంజి
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 52 రోజుల పాటు సమ్మె చేసిన విషయం అందరికి తెలిసిందే. సమ్మె విరమణ తర్వాత విధుల్లోకి చేరాలని కార్మికులు నిర్ణయించుకున్న... ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. సమ్మె చట్టవిరుద్ధమైదన్న ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.. తిరిగి కార్మికులను విధుల్లోకి చేర్చుకునేది లేదన్నారు. కార్మికులను విధుల్లోకి చేర్చుకునేందుకు పెద్దగా ఇష్టపడని సీఎం కేసీఆర్ అందుకనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 28, 29న తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆర్టీసీ అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. ఆర్టీసీ ఒక శాశ్వత పరిష్కరం చూపాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. కార్మికుల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.
కార్మికులకు రెండు ప్రధాన షరతులు పెట్టి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న శాశ్వత డిమాండ్‌ను వదిలేయాలి. మరో సమ్మెకు చేయకుండా కార్మికులు, కార్మిక సంఘాలతో సంతకాలు చేయించాలని ప్రభుత్వం చూస్తోన్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వాటి తీర్పు వచ్చే వరకు చూస్తే ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కార్మికుల్లో కూడా మనోస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం భావవిస్తోంది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ నెల 29న కూడా మంత్రివర్గ సమావేశం అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆర్టీసీ అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యకు ఎండ్ కార్డ్ ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించనున్నారు.