సీఎం వైఎస్‌ జగన్‌కు ఓ కార్యకర్త కన్నీటితో రాసిన లేఖ..!

By Newsmeter.Network  Published on  6 Oct 2019 4:58 AM GMT
సీఎం వైఎస్‌ జగన్‌కు ఓ కార్యకర్త కన్నీటితో రాసిన లేఖ..!

గిద్దలూరు, ప్రకాశం జిల్లా: మీరు చదవబోయే లేఖలో అక్షరం అక్షరంలో ఆవేదన ఉంది. అలానే తనను ఆదుకోని వైఎస్ఆర్‌ సీపీ నేతల మీద ఆక్రోశమూ ఉంది. ఓ తండ్రి వేదన ఎలా ఉంటుందో..నమ్ముకున్న వాళ్లు ఆదుకోపోతే మనసు ఎలా మెలియ తిరుగుతుందో.. ఈ లేఖలో ప్రతి అక్షరం చెబుతుంది.

లేఖలో మౌలాలి ఏం రాశారో మీరూ చదవండి

అయ్యా జగన్‌ గారు.. నా పేరు షేక్ మౌలాలి అంటూ లేఖ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గుడిమెట్ల గ్రామం నాది.వైఎస్ఆర్‌ సీపీ పుట్టినప్పటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్నాను. పార్టీ సిద్ధాంతాలకు లోబడి గెలుపు కోసమే కృషి చేశాను. మీరు ప్రవేశ పెట్టిన నవరత్నాలు ఇంటింటికి ప్రచారం చేయడంలో నా వంతు కృషి చేశాను. ఇదే సమయంలో శాంసంగ్ కంపెనీలో ఎలక్ట్రానిక్స్ ఫిట్టింగ్ వర్క్ జాబ్ కూడా వచ్చింది. నేను జాబ్‌ను సైతం వదులకుని మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రచారం చేశాను. ఇది నా బాధ్యత అనుకుని పార్టీ కోసం పని చేశాను. అందరి కఫ్టం ఫలించి ఫలితం దక్కింది. గెలిచిన తరువాత గిద్దలూరు నియోజకవర్గ కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు.

ఈ క్రమంలో మా పాపకు 18-09-2019న డెండ్యూ జ్వరం వచ్చింది. నా ఆర్ధిక పరిస్థితి సరిగాలేక దగ్గర్లో ఉన్న ఆర్‌.ఎం.పీ డాక్టర్‌కు చూపించాను. అలా రెండ్రోజులు చూపెట్టాను. డెంగ్యూ జ్వరం తగ్గకపోగా ఎక్కువైంది.మా ఆవిడ వెండి కాళ్ల పట్టీలు తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకున్నాను . ఆ డబ్బుతో ఒంగోలు పెద్దాస్పత్రికి బయల్దేరాం. మార్గమధ్యలోనే మా పాప చనిపోయింది.అయినా..ఆశతో ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఒంగోలు ఆస్పత్రి వైద్యులు కూడా పాప చనిపోయిందని నిర్ధారించారు. నా ఒకగానొక కూతరు మమ్మల్ని వదిలి పెట్టి వెళ్లి పోయింది. చేసేదేమీలేక సొంతూరు వచ్చి దహనసంస్కారాలు పూర్తి చేశాను.

గిద్దలూరులో ఉన్న వైఎస్ఆర్ సీపీ నేతలకు మా పాప చనిపోయిందని తెలియజేశాను. కనీసం మానవతాధృక్పథంతో కూడా ఏ నాయకుడు స్పందించలేదు. ఎంతో బాధ వేసింది. నా లాంటి పరిస్థితి ఏ వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తకు రాకూడదని శోకంతో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అంటూ లేఖ ముగించారు మౌలాలి.

మౌలాలి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎవరికైనా అనిపిస్తే..మానవత్వం ఉందని నిరూపించాలని అనుకుంటే..మంచి మనసుతో , మానవతాదృక్పథంతో మౌలాలి కుటుంబాన్ని ఆదుకోండి. మౌలాలి మొబైల్ నంబర్: 9951277887

Next Story
Share it