రాజధాని నిర్ణయంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

By రాణి  Published on  3 Jan 2020 8:04 AM GMT
రాజధాని నిర్ణయంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

గ్రామం నుంచి రాష్ర్ట పాలన వరకూ అందరూ సమానమేనన్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందరికీ అభివృద్ధి ఫలాలందాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటించిన అనంతరం వంగాయగూడెంలో పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ..అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం జరుగుతుందన్నారు. అందుకే అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామని, గత ప్రభుత్వ నిర్ణయాలన్నీ అన్యాయంగా తీసుకున్నవేనని జగన్ విమర్శించారు. అన్ని ప్రాంతాలూ అన్నదమ్ముల్లా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. రాష్ర్ట ప్రజలందరి కోసం, రాష్ర్ట అభివృద్ధి కోసమే అధికారాన్ని ఉపయోగిస్తున్నాం గానీ..అధికార దుర్వినియోగానికి పాల్పడటం లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక ప్రాతిపదిక ఉంటుందన్నారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ కార్డుల్లో చేస్తున్న కీలక మార్పులను జగన్ వివరించారు. ఇకపై ఆరోగ్యశ్రీ కింద 2059 వ్యాధులకు వైద్యసేవలు అందిస్తామన్నారు.

Next Story