రాజ్యాంగ వ్యవస్థను రద్దు చేయడం వైసీపీ అనుకున్నంత సులువు కాదని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి, మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు. కౌన్సిల్ ను రద్దు చేయడం అంటే…ప్రజే వేదికను కూల్చినట్లు కాదని వైసీపీకి చురకలంటించారు. కేబినెట్ లో మండలి రద్దును ఆమోదించి, అసెంబ్లీలో తీర్మానం చేసినా…మండలి రద్దు కాదన్నారు. మండలిని రద్దు చేయాలంటే రెండు మూడేళ్లు పడుతుందన్నారు. 2021 కల్లా మండలిలో వైసీపీకే మెజారిటీ వస్తుందని, అలాంటప్పుడు కౌన్సిల్ ను రద్దు చేయాల్సిన అవసరం ఏముందని యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని, మూడ్రోజుల్లో వైసీపీ నాయకుల ఆటలు సాగకే అక్కసుతో రగిలిపోయి…కేబినెట్ భేటీలో మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీ కేబినెట్ మండలి రద్దుకు ఆమోదం తెలిపింది. ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి..అక్కడ తీర్మానాన్ని ఆమోదించనుంది ఏపీ ప్రభుత్వం. అసెంబ్లీ ఆమోదం తర్వాత మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అయితే కేంద్రం కూడా మండలి రద్దు తీర్మానంపై పెద్దగా సమయం తీసుకునేలా కనిపించడం లేదు. అయితే…ఈ తీర్మానాన్ని కేంద్రం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే…రాష్ర్టపతి నుంచి ప్రకటన రావాల్సి ఉంటుంది. ఇదంతా జరిగే సరికి ఆర్నెల్లు ఇట్టే గడిచిపోతాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.