ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా గిన్నీస్‌ వరల్డ్ రికార్డులోకెక్కిన జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె (112) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి జ్వరం, శ్వాస సంబంధ వ్యాధులతో భాదపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారని.. మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్లు గిన్నీస్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు తెలిపారు. చిటెస్తు వటనాబేకు ఐదుగురు సంతానం కాగా..12 మంది మనవళ్లు, 17 మంది ముని మనవండ్లు ఉన్నారు.

1907లో ఉత్తర జపాన్‌లోని చిటెట్సు వటనాబె నీగటాలో జన్మించాడు. చిటెట్సు వటనాబె అగ్రికల్చర్‌ స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. 18 ఏళ్లుగా తైవాన్‌లో నివసిస్తున్నాడు. మిట్సు అనే మహిళను వివాహాం చేసుకోగా వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. తిరిగి తన స్వస్థలమైన నీగటకు చేరుకున్న అతను ప్రస్తుతం అక్కడే కాలం వెళ్లదీస్తున్నాడు. ‘ఎప్పుడూ కోపానికి రాకండి. ముఖాలపై చిరునవ్వును చెరగనీయకండి’ సలహా ఇచ్చిన.. ఆయన ఇక లేరు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.