రాశీఖ‌న్నా అప్ప‌ర్ థొరాక్స్‌ను మాత్ర‌మే చూస్తాడ‌ట‌..!

By రాణి  Published on  13 Feb 2020 10:09 AM GMT
రాశీఖ‌న్నా అప్ప‌ర్ థొరాక్స్‌ను మాత్ర‌మే చూస్తాడ‌ట‌..!

రాశీఖ‌న్నాతో డేటింగ్ చేసే వ్య‌క్తి ఆమె అప్ప‌ర్ థొరాక్స్‌ను మాత్ర‌మే చూస్తాడ‌ట‌. కాగా, ఈ పొడుగు కాళ్ల సుంద‌రి తాజాగా న‌టించిన‌ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ఈ నెల 14న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, రాశీఖ‌న్నాతోపాటు ఐశ్వ‌ర్య రాజేష్‌, ఇజాబెల్లా హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందింది. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా గోపీసుంద‌ర్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రాన్ని కే.ఎస్‌.రామారావు నిర్మించారు.

చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేసే క్ర‌మంలో ప్ర‌మోషన్స్‌ను వేగ‌వంతం చేసింది సినిమా యూనిట్. ఆ క్ర‌మంలోనే ఇప్ప‌టికే హీరో హీరోయిన్ల‌తో ప‌లు ఇంట‌ర్వ్యూలను కూడా షూట్ చేశారు. తాజాగా, ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హీరో హీరోయిన్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. అది కూడా డేటింగ్ గురించి.

ముందుగా చిత్రం గురించి మాట్లాడిన విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేక్ష‌కుల‌కు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ గ్యారెంటీ అంటూ హామీ ఇచ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల‌కు భిన్నంగా, మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌ని చూడాల‌నిపించే సినిమా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ తిన‌ని ఫుడ్ రుచిగా ఉంటే ఎలా ఉంటుందో సినిమాల ప‌రంగా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ కూడా అలానే అంటూ ఒక్క మాట‌లో చెప్పుకొచ్చాడు.

రాశీఖ‌న్నా మాట్లాడుతూ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ట్రైల‌ర్ ట్రెండింగ్‌లో ఉంద‌ని, అయినా సినిమాపై ఎవ్వ‌రికీ ఎటువంటి క్లారిటీ లేద‌న్నారు. సినిమాపై ఎగ్జైట్‌మెంట్‌ను పెంచే ట్రైల‌ర్‌ల‌లో ఇదీ ఒక‌టి. సినీ జ‌నాల‌కు మంచి కిక్ ఇచ్చే సినిమాల్లో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ కూడా చేరిపోనుందంటూ చెప్పుకొచ్చింది. ఐ లైక్ ద‌ట్ టైప్ ఆఫ్ కిక్ అంటూ త‌న‌దైన మాస్ క్యార‌క్ట‌రైజేష‌న్‌తో సినిమా గురించి వివ‌రించింది.

ఇంత‌లో హీరో హీరోయిన్ల మధ్య ఎంట్రీ ఇచ్చిన యాంక‌ర్ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైలెట్‌ను ల‌వ్ చేసిన‌ట్టు నిజ జీవితంలో కూడా క్రేజీగా ఎవ‌రినైనా ల‌వ్ చేయాల‌నిపించిందా..? అంటూ రాశీఖ‌న్నాను అడ‌గ్గా, ట‌క్కున ఐ వాన్ట్ టు డేటింగ్ విత్ డాక్ట‌ర్ అంటూ చెప్పింది. ఒక‌వేళ డాక్ట‌ర్‌తో డేటింగ్ చేస్తే అత‌ను నీలో రాశీఖ‌న్నాను చూడ‌డు..నిన్నొక పేషెంట్ మాదిరి ట్రీట్ చేస్తాడు. అత‌ను నీ అప్ప‌ర్ థొరాక్స్ మాత్ర‌మే చూస్తాడు అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ మాట‌లు క‌లిపాడు. ఇలా ఇంట‌ర్వ్యూ ఆద్యాంతం ఫ‌న్నీగా సాగింది.

Next Story
Share it