'తేనెటీగలు' తేనెను ఎందుకు తయారు చేసుకుంటాయి

By సుభాష్  Published on  20 May 2020 7:42 AM GMT
తేనెటీగలు తేనెను ఎందుకు తయారు చేసుకుంటాయి

మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం

తేనెటీగలనేవి ఒక రకమైన తుమ్మెదలు. ఆర్థికపరంగా మానవులకు సహాయపడుతున్న ఉత్పాదక కీటకాలు. ఇవి పూలనుంచి మకరందాన్ని సేకరించి తేనెపట్టులో ఉంచి తేనెగా మారుస్తాయి. ఇవి సంతానోత్పత్తి కోసం తేనెపట్టును ఏర్పరచుకొంటాయి. తేనెటీగల సహనివేశం సాధారణంగా ఒక రాతికిగాని, భవనాలకు, చెట్టుకు తేనెపట్టును నిర్మిస్తాయి. ఒక్కొక్క తేనెతెట్టులో దాదాపు 50,000 తేనెటీగలు ఉంటాయి. ఒక్కొక్క తేనెపట్టులో మైనంతో చేసిన షడ్భుజాకారపు కక్ష్యలు అనేకం ఉంటాయి. ఇవి రెండు రకాలు: 1. తేనెను, పుప్పొడి రేణువులను నిల్వ ఉంచేవి. 2. పిండ సంరక్షణకు ఉపయోగపడేవి. ఇవికాక రాణీ ఈగ కోసం పెద్ద కక్ష్య ఒకటి ఉంటుంది. పిండ రక్షణ కక్ష్యలో అండాలుంటాయి. తేనె పుప్పొడి రేణువులు పిండదశలకు ఆహారం. పిండదశల నుండి కొత్త ప్రౌఢ ఈగలొస్తాయి. మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా ఈ కథనం.

Honey

ఈ భూమి మీద బతికే హక్కు మనిషికి ఎంతుందో మిగతా జీవులకు కూడా అంతే ఉంది. ప్రతి మనిషి కేవలం తన కోసమే జీవిస్తా డు. కానీ మిగతా జివరాశులు అవి జీవిస్తూ సహచర ప్రాణులకు జీవనాధారరంగా మారుతున్నాయి. ఈ భూమి మీద తప్పనిసరిగా బతకాల్సిన జీవుల జాబితాలో అన్నింటికంటే ముందున్నది తేనెటీగ.

తేనెటీగలు తమ ఆహారం కోసం తేనెను తయారు చేసుకుంటాయి. తేనెటీగ ఆహారం దాచుకునే ఒక పద్దతే తేనె తయారయ్యే ప్రక్రియ. మొదట తేనెటీగల పువ్వుల నుంచి మకరందాన్ని తాగుతుంది. తర్వాత ఆ మకరందాన్ని తన తో పాటు తేనెసంచిలో మోసుకుని ఇంటికి తీసుకువస్తుంది. ఈ సంచి తేనెటీగల కడుపులో జీర్ణశయానికి వెలుపల ఉంటుంది. ముందుగా తేనెటీగ కడుపులో ఉన్నప్పుడే మకరందం తేనెగా మారుతుంది. మకరందంలో ఉండే చక్కెర పదార్థానికి రసాయనిక చర్య జరిగిన తర్వాత మధువులో ఉండే నీరు పూర్తిగా తీయబడుతుంది. తేనెతుట్టెకు ఉన్న ద్వారాల వేడి లోపలికి ప్రవేశించడంతో ఈ నీరు పూర్తిగా అవిరైపోతుంది. దీని వల్ల తేనె చాలా కాలం నిల్వ ఉంటుంది.

Honey Bee1

తేనెటీగ తేనెతుట్టెలో మకరందాన్ని తేనెగా మార్చుకుని ఆహారంగా ఉపయోగించుకోవడానికి ఆ తేనెను దాచుకుంటుంది. ఒక్కోసారి తేనెటీగలకు పువ్వుల మకరందం లభించినప్పుడు రకరకాల పురుగుల నుంచి చెట్ల నుంచి తియ్యటి ద్రవాలను సేకరిస్తుంటాయి. ఒక్క తేనెతుట్టె ఏర్పడడానికి కొన్నివందల తేనెటీగలు వేలసార్లు అటు ఇటు తిరుగుతుంటాయి. ఆహారం కోసం తేనెటీగలు ఎంతో కష్టపడుతుంటాయి.

తేనెతుట్టెలోంచి తేనెను తీసేందుకు పద్దతులు

అయితే మనుషులు తేనెతుట్టెలోంచి తేనెను తీయడానికి రకరకాల పద్దతులను అనుసరిస్తుంటారు. తేనె పూర్తగా పువ్వులపై ఆధారపిడ ఉంటుంద.ఇ పువ్వులు ఎక్కువగా పూసేచోటే తేనెతుట్టెలు కనిపిస్తుంటాయి. తేనెకు ఇంతగా మన ఆహార పదార్థాలలో ప్రాధాన్యత కలగడానికి ఎన్నో కారణాలున్నాయి. అంతేకాదు తేనెలో విటమిన్‌లు, ఎంజైమ్‌లు, ప్రోటీన్స్‌, ఆసిడ్‌, చక్కెర మొదలైనవి ఉన్నాయి. మకరందాన్ని బట్టి తేనె రంగు ఆధారపడి ఉంటుంది.

Next Story