ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి ఫ్రిజ్‌లో మృతదేహం కనిపించడం షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రాన్స్‌ లోని ఓ ఇంట్లో నూతన సంవత్సరం రోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక మంటలను ఆర్పివేసిన అనంతరం ఇంట్లోకి వెళ్లిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫ్రిజ్‌లో ముక్కలు ముక్కలుగా నరికిన 83 సంవత్సరాల మహిళ మృతదేహం కంటపడింది. ఆశ్చర్యపోయిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఉన్న మనవడిని పోలీసులు ప్రశ్నించగా,  పొంతనలేని సమాధానాలు ఇస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళను  మనవడే హతమార్చి మృతదేహాన్ని నరికి ‌ఫ్రిజ్‌లో దాచి, ఎవరు కనిపించని సమయంలో ఎక్కడికైన తరలించాలనే ఉద్దేశంతో ఇలా చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.