మాస్కులు వాడుతున్నారా..? అయితే ఇవి త‌ప్ప‌ని స‌రిగా పాటించాల్సిందే: WHO

By సుభాష్  Published on  30 Oct 2020 10:16 AM GMT
మాస్కులు వాడుతున్నారా..? అయితే ఇవి త‌ప్ప‌ని స‌రిగా పాటించాల్సిందే: WHO

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు ధ‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కరోనా జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. అందులో మాస్క్‌ ధరించడం ఒకటి. కోవిడ్‌ కారణంగా మాస్క్‌ ఉంటేనే బయట తిరిగే పరిస్థితి. వాటిని సరిగ్గా వాడకపోతే ప్రమాదం పొంచివుందని అంతర్జాతీయ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. అయితే ఇప్పటికే కరోనాపై, మాస్కులపై ఎన్నో సూచనలు చేసిన డబ్ల్యూహెచ్‌వో మరోసారి మాస్కులపై జాగ్రత్తలు తెలిపింది.

► మాస్కులు వదులుగా ఉండకుండా చూసుకోవాలి. టైట్‌గా, నోటిని పూర్తిగా కప్పేలా ఉండాలి.

► మాస్కులు తలకిందులుగా పెట్టుకోకూడదు

► ఒకరు ధరించిన మాస్కును వేరే వారు ధరించకుండా చూసుకోవాలి

► ఎల్లప్పుడూ మీ మాస్క్‌ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ముఖంపై మొటిమలు వచ్చే అవకాశాలున్నాయి

► మాస్క్‌ ముందు భాగాన్ని చేతితో పట్టుకుని సరి చేయడం మంచిది కాదు

► ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్క్‌ తీయకూడదు

► మాస్కులు ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రం చేసినవి వాడాలి

► ఎప్పుడు ఒక మాస్కునే కాకుండా రెండు మాస్కులను దగ్గర ఉంచుకుని తరచూ వాటిని మార్చడం మంచిది

► మాస్కులను పెట్టుకునే ముందు, పెట్టుకున్న తర్వాత చేతులను చేతులను కడుక్కోవాలి.

Next Story