మేష రాశి :– ఈ రాశి  వారికి లగ్నాధిపతి ఉచ్చ క్షేత్రం లో ఉండటం చాలా శుభపప్రదం. అలంకార ప్రాప్తి ఉంది. సర్వసంపదలు చేకూరుతాయి. ధనలాభం కూడా ఉంది. సంతోషాన్ని ఆనందాన్ని కూడా అనుభవించ బోతున్నారు. అయితే గురుడు తన నీచ క్షేత్రంలో అతిచారం మార్పు వల్ల శ్రమ పడక తప్పదు. సంపాదించినవి నిలబడవు. రాజకీయ సినీ రంగాల్లో  ఉన్నవారికి మాట పట్టింపులు చిక్కులు తప్పవు. వీరు మంచిగా అనుకున్నవాళ్లు శత్రువులుగా మారతారు. ఈ వారంలో అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువవుతాయి. రవి మారకుడు అయినప్పటికీ లాభ స్థానం లో చేరడం వల్ల వీరికి ధనవ్యయం చేయించేస్తాడు. ఆరోగ్య విషయంలోనే సరిగాఉండదు. బుధుడికి లాభస్థానం కావడం వల్ల లాటరీ ఆకస్మిక ధనలాభము ఉన్నాయి. వీరు ఎక్కువగా  సంతోషము ఆనందాన్ని పొందగలరు. వివాహం కావల్సిన వాళ్లకి కొంత ప్రతికూలమైన వాతావరణంగా ఉంది. అశ్విని వారికి విపత్తుతో వార ప్రారంభం కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. భరణి వారికి సంపత్తార అయింది కాబట్టి అశుభ ఫలితాలు పొందుతారు. కృత్తిక ఒకటోపాదంవారికి జన్మతార అయింది కాబట్టి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.

పరిహారం :- ఆంజనేయస్వామిని అర్చన చేయండి. మంగళవారం నాడు కొమ్ము శనగలు  నివేదన చేయడం గారెలు దండ వేసినా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే సత్ఫలితాలు వస్తాయి.

వృషభరాశి :– వీరికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా మంచి ఫలితాన్నివ్వ బోతున్నాడు. అదే విధంగా కుజుడు ఉచ్చ క్షేత్రంలో ఉండటం కూడా శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా వీరికి దేనికి లోటున్నట్లుగా కనిపించదు. చక్కనైన భోజన సౌఖ్యము శరీర సౌఖ్యము లభిస్తాయి. అయితే రాహు అకారణ  కలహ కారకుడు అవుతాడు. ధనలాభం ఎంతైతే ఉందో ధనం వ్యయం కూడా అంతే జరుగుతుంది. ఏదైన వస్తువును పోగొట్టుకుంటారు కొద్దిసేపు ఇబ్బంది పడతారు మళ్లీ అది దొరికే అవకాశం కూడా లేకపోలేదు. వీరికి రోగ బాధలున్నాయి. కష్టపడిన దానికి తగిన ఫలితాన్ని మాత్రమే పొందగలుగుతారు. సుఖ సంతోషాల్ని ధనలాభాన్ని ఈ వారంలో వీరు ఎక్కువగా పొందగలుగుతారు. వివాహం కావల్సిన వాళ్లు వారి ప్రయత్నాన్ని కొనసాగిస్తే మంచిది. వారం మధ్యలో కొంచెం ఇబ్బంది పడినా వారాంతంలో వీరికి మంచి ఫలితాలు రావచ్చు. ఉద్యోగ విషయంలో లాభిస్తుంది భాగ్య శని స్వక్షేత్ర వర్తి అవటంవల్ల అనారోగ్యాన్ని సూచించినప్పటికీ ఆర్థిక స్థితిగతులు మాత్రం బాగుంటాయి. కృతిక రెండు మూడు నాలుగు పాదాల వారికి జన్మ తారైంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. రోహిణి వారికి పర్లమమిత్ర తారైంది కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి మిత్రతార మంచి విషయాన్ని చూడగలుగుతారు.

 పరిహారం :– ఈ రాశివారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్య నమస్కారాలు చేసిన ఇంద్రుని ప్రార్థించినా మంచిది. మీరు ఎక్కువగా తెల్ల వస్త్రాన్ని ధరించినా శుభప్రదంగా కూడా ఉంటుంది.

మిథున రాశి :– ఈ రాశివారికి స్వక్షేత్రంలో రాహు చాలా భయపెట్టి విడిచిపెడతాడు. వీరి పరిస్థితి వీరికే ఆశ్చర్యంగా అయోమయగా అనిపిస్తుంది.  పశ్చాత్తాపం పడే అవకాశంఉంది. ద్రవ్య ,ధననష్టం ఉంది. అందరూ అవమానపరచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క రవి మాత్రమే వీరికి కొంచెం మేలు చేసే అవకాశం ఉంది. శుక్రుడు యోగ కారకుడైన వ్యయస్థానంలో పడిపోవడం వల్ల వీరికి నిందలు తప్పువు.  రవి మాత్రం మీ కార్యాల్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు. మీకీ వారంలో ధనవ్యయం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఆరోగ్యం కోసం ధనాన్ని ఖర్చుపెట్టవలసి వస్తుంది. శత్రువులు మీకంటే ముందే మీ ఎత్తుగడలు తెలుసుకుని అధిగమించి మీమీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం  ఉంది. కుటుంబపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమయానికి సహకరించే వాళ్లు కూడా మీకు లభ్యం కారు. ధనం అందదు. మీకు శుక్రవారం వరకు కూడా మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. శనివారం నాడు కొంత మనశ్శాంతిని పొందగలుగుతారు. మీరనుకున్న స్థాయి కంటే మీరు ఒక మెట్టు దిగిపోవడం  మీరు ఈ వారంలో చూస్తారు. మీకు ఉత్సాహాన్నిచ్చే టటువంటి కుటుంబ వ్యవహారాలు దూరంగా ఉండడం వల్ల మిమ్మల్ని బ్బంది కలిగిస్తాయి. కానీ ఏదో ఒక శుభవార్త మిమ్మల్ని ఉత్సాహ పూరితులను చేస్తుంది . మీకున్న వివాదాలు కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు కూడా పనికిరావు. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ వారం మీకంత మంచిదిగా కనిపిస్తోంది. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి మిత్రతార గాబట్టి సత్ఫలితాలు ఉన్నాయి. ఆర్ద్ర వారికి నైధన తారైంది కాబట్టి దుష్ఫలితాలు ఎక్కువగా అనుభవిస్తారు. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి సాధన తారైంది కాబట్టి  అనుకుంటే చక్కగా నెరవేరుతాయి .

పరిహారం :- ఈ రాశివారికి విష్ణు సహస్రనామ  పారాయణ చేయడం శ్రీ మహా విష్ణుని తులసీ దళాలతో అర్చన చేయడం మంచి ఫలితాలిస్తాయి.

కర్కాటక రాశి :– ఈ రాశివారికి నలుగురు శుభులు ఉన్నాగురుడు నీచను పొందడం వల్ల తమ జ్ఞానం తనకు పనికిరాకుండాపోతుంది. సకాలంలో జ్ఞాన వినియోగం జరగదు. ఏ పని తలపెట్టినా ప్రతిదీ వాయిదా పడుతూనే ఉంటుంది. వారం ప్రారంభంలో రెండు రోజులు చివర్లో ఒక్కరోజు మాత్రమే వీరు దేన్నైనా సాధించ గలుగుతారు. వీరికి ఆకస్మికంగా ధన యోగం మాత్రం ఉంది. ఏదో ఒక పెద్ద పనికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం మాత్రం వాయిదా పడినా భవిష్యత్తులో లాభం జరుగుతుంది. శని కుజుల కలయిక వీరికి చాలా నష్టాన్ని కష్టాన్ని కూడా కలుగచేస్తుంది. వివాహ వ్యాపార రాజకీయ ఏ రంగంలో ఏ ప్రయత్నం చేసినా అడుగు ముందుకు పడటం చాలా కష్టంగా మారిపోతుంది సమయానికి ఏదో విధంగా ధనం అందుతూ పనులు మాత్రం పూర్తవుతాయి. ఎంత ధనం సంపాదించినా ఎంత కష్టపడి తెచ్చినా  వ్యయమందున్న రాహువు ప్రభావంచే అది దుర్వినియోగం ఔతుంది.ఈ వారం మీరు ఆచితూచి అడుగు వేయడం మంచిది. పునర్వసు నాలుగో పాదం వారికి సాధన తారైంది చాలా బావుంది. మంచి ఫలితాలు ఉన్నాయి . పుష్యమి వారికి ప్రత్యక్తార గాబట్టి పరిస్థితులు వ్యతిరిక్తంగా ఉంటాయి. ఆశ్లేష వారికి క్షేమ తార కాబట్టి సుఖ సౌఖ్యాల్ని పొందగలుగుతారు. పరిహారం :- మానసిక ఆందోళన తగ్గడానికి అమ్మవారిని ఆరాధించండి ఖడ్గమాల పారాయణ చేయండి. ఆవుపాలతో శివునికి అభిషేకం మంచిది.

సింహరాశి :- మీకు ఈవారం చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న  చాలా పనులు పూర్తవుతాయి. విశేష ధనప్రాప్తి వల్ల అన్ని ఆటంకాలు కొట్టుకుపోతుంటాయి. గొప్ప గొప్ప ఆలోచనలు ఒస్తాయి. ఇంటా బయటా మీరు గెలవ గలుగుతారు.మానసికంగా లోలోపల కొంత ఇబ్బందులున్నా జరిగిన కొన్ని పనులు మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తే కొన్ని బాధ్యతల నుండి మీరు బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.  మీ ఆలోచనలన్నీ కార్యరూపంలోకి వచ్చేస్తాయి. విశేష ధనప్రాప్తి ధనలాభం అన్ని రకాలుగా మీకుంద. మీకు మీరే సాటి అనంత రీతిలో పదిమంది చేత పొగడ బడతారు. విద్యాభివృద్ధికి అవకాశముంది. వ్యాపారాభివృద్ధికి అవకాశం. ఏదైనా సంకల్పించుకుంటే పరీక్షలో ఉత్తీర్నులై కొత్త ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. అయితే స్థానచలనం వుండొచ్చు. మఖా నక్షత్రం వారికి విపత్తారైంది కాబట్టి ప్రతికూల ఫలితాలున్నాయి. పుబ్బా నక్షత్రం వారికి సంపత్తార అయింది ఆకస్మిక ధన లాబాదులున్నాయి.  ఉత్తర ఒకటో పాదం వారికి జన్మ తారైంది ఆరోగ్యం సరిచూసుకోండి .

పరిహారం : సూర్యనమస్కారాలు చేయించండి. విష్ణు సహస్రనామ  పారాయణ చేయండివిశేష ఫలితాన్ని ఇస్తుంది.

కన్యా రాశి :– ఈ రాశివారికి ఎప్పటిలాగే భయం ఎక్కువగా ఉంటుంది. సంపద లాభం మాత్రం కొద్దిగా కనిపిస్తోంది. అలంకారాన్ని గూడా పొందగలుగుతారు. కొన్ని విషయాల్లో పెద్దల చేత మాటలు పడే అవకాశం ఉంది. కొంత విచారాన్ని కూడా పొందవలసి వస్తుంది. గురుడు నీచ పొందడం వల్ల వీళ్ళ ఆలోచనలు స్థిరంగా ఉండవు. పిల్లల ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. పొరపాటు మాట వల్ల తనకు వచ్చే చిన్న అవకాశాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది.  చంద్ర సంచారం వల్ల మాత్రమే వీళ్లు సౌఖ్యాన్ని పొందగలుగుతారు. రాజకీయ ఉద్యోగ వ్యాపార సామాజిక రంగాల్లో దూరంగా ఉండడం మంచిది. కుటుంబ విషయంలో అందోళన పొందినా వారాంతంలో అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. మానసికాందోళన ఎక్కువగా ఉంటుంది. శత్రువులు భయం కూడా ఉంది చిన్న గౌరవ భంగం కూడా అవకాశముంది. కనుక ఆచితూచి మాట్లాడటమే ఆచి తూచి పనిలోకి దిగడం చాలా అవసరం . ఆరోగ్యాన్ని కూడా ఓ కంట కనిపెట్టడం మంచిది. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి జన్మ తారైంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. హస్తవారికి పరమమిత్రతారైంది కొంచెం సానుకూల ఫలితాలు. చిత్త ఒకట్రెండు పాదాలు వారికి మిత్రతారైంది కాబట్టి పూర్తి సానుకూలత ఉంది.

పరిహారం :- బుధవారం నియమాన్ని పాటించండి. గోసేవ మీకు మంచి ఫలితాలను ఇవ్వగలదు.

తులా రాశి :– ఈ రాశి వారికి అన్నీ అరచేతిలో ఉన్నట్లే అనిపిస్తుంటాయి మంచి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయగలుగుతారు. కానీ వీరికి కొన్ని నష్టములు కొన్ని శరీర ఆరోగ్య పరమైన ఇబ్బందులు  ఉన్నాయి. వీరు ఒక విధంగా చెప్పాలంటే ఈ వారంలో మృత్యు ముఖానికి వెళ్లొస్తారు.కనుక ముందుగానే వైద్యుల్ని సంప్రదించండి. శత్రువులు నశిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా నిర్ణయాలు జరుగుతాయి. కొన్ని పొరపాట్లకు వీళ్లు అధికారిక  ఒత్తిడిని భరించవలసివస్తుంది. తాత్కాలికమైన సుఖ సౌఖ్యాలను మాత్రమే కొంతవరకు పొందగలుగుతారు. అనవసర విషయాల్లో కల్పించుకుని మిత్రుల చేత హెచ్చరికలు అలాగే కొంత ధర నష్టాన్ని పొందుతారు. సమయానికి మీకు ధనం అందక కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆచి తూచి అడుగు వేయడం మంచిది. చిత్ర మూడు నాలుగు పాదాల వారికి మిత్ర తారైంది కాబట్టి చాలా బావుంటుంది. స్వాతి వారికి నైధన తారైంది పూర్తిగా వ్యతిరేక ఫలితాలనిస్తున్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి సాధన తారైంది శుభఫలితాలు కనిపిస్తున్నాయి.

 పరిహారం :- ఈ రాశివారు వీలైనంత వరకు వజ్రాన్ని ధరిస్తే మంచిది దాన్ని అభిషేకంలో పెట్టి మళ్లీ ధారణ చేయండి. తెల్లని వస్త్రాన్ని దానం చేయడం ,తెల్లటి బట్టలను ధరించండి మీకు మంచి జరుగుతుంది.

వృశ్చిక రాశి :– ఈ రాశి వారికి శుభాశుభాలు సమానంగా ఉన్నాయి. సకల సదుపాయాలు ఉంటాయి. అనుభవించే యోగం ఉండదు ధనలాభం కలుగుతుంది. కాని కష్టమూ తప్పదు శత్రువులుగా జయము సంపాదించుకుంటారు గొప్ప భయాన్ని కూడా అనుభవిస్తారు. ముఖ్యంగా అనారోగ్యం ఉంది వైద్యుల్ని సంప్రదించి ముందుగానే సరి చూసుకోవడం చాలా మంచిది ఏదైనా వస్తువుని పోగొట్టుకున్నది పెద్ద వాళ్లచేత  హెచ్చరింపబడే అవకాశం కూడా లేకపోలేదు అకారణంగా మీరు ఏ విషయంలోనూ కల్పించుకుని ముందుకు వెళ్లకండి తనవల్ల మీకు మానసిక శారీరిక ఇబ్బందులు ఏర్పడతాయి శని ధనలాభాన్ని ఇస్తున్నప్పటికి కూడా మీకు గురుడు స్థానం మారడం వల్ల అతిసారం అవడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రత్యేకమైన ఒక పనిని కల్పించుకున్న ట్లయితే మీకు ఇబ్బందులుండవు దానివల్ల ధనలాభం కూడా కలుగుతుంది రాహు పరిస్థితి మీకు చొర వాదన కలిగించి పోతుంది జాగ్రత్త వహిస్తే చాలా మంచిది చంద్రుని స్థితి మీకు ఏప్రిల్ ఒకటో తేదీన మీకు పూర్తి ప్రతికూలంగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి విశాఖ నాలుగో పాలం వారికి సాధన తయారైంది చాలా బావుంది. అనూరాధ వారికి ప్రత్యేక కారింది కాబట్టి వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి జెస్ట్ వారికి క్షేమ తయారైంది కాబట్టి శుభ పరిణామాలు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి పరిహారం రాశివారు గురునకు జపం  చేసుకోవడం దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

ధనూరాశి: ఈ రాశివారు కష్టాలన్నీ వీరికి వచ్చాయా అన్నట్లు ఈ వారం చాలా ఇబ్బందిని కలిగించ చేస్తుంది కొద్దిపాటి జరనున్న కూడా అన్ని ర రకాలైన ఇబ్బందుల్ని ఈ వారంలో వీరు చవిచూస్తారు అపకీర్తి శత్రు వృద్ధి వీరికి కాలసర్ప యోగం పూర్తిగా వర్తిస్తుంది భ మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వృత్తిపరంగా కూడా మిమ్మల్ని వెనక్కి లాగేసే రాజకీయ రంగాల్లో ఉన్నవారైతే పదవులను కోల్పోయే అవకాశం కూడా మంది. ద్వితీయ శని కుజ గురుల కలయిక ఆందోళనలు కలిగిస్తుంది . ఉద్యోగాలు కూడా ముప్పు వాటిల్లుతుంది  మాట నెమ్మదితనం కలిగించండి సాధ్యమైనంత వరకు మౌనముద్ర మీ ఆరోగ్యాన్నే కాదు మీ ఆర్థిక స్థితిగతులను కూడా మారుస్తుంది మీరంటే మంచి అభిప్రాయం ఉన్నవాళ్ళు కూడా లేకపోలేదు వ వారి వల్ల మీకు మరికొంచెం లాభమే కలుగుతుంది శత్రువులు వృద్ధి చెందుతున్నారు జాగ్రత్తగా చూసుకోండి మూల నట్లు త్రి ద్యార్థులకు విపత్తార అయింది కాబట్టి తిరిగి ఫలితాలున్నాయి పూర్వాషాడ నట్లు చరితార్థులు సంపత్ తయారైంది సత్ఫలితాలని మంచి ఫలితాలు పొందగలుగుతారు ఉత్తరాషాఢ నటి నక్షత్ర జాతకులకు జన్మ తయారైంది కాబట్టి ఆరోగ్యం సరి చూసుకోండి పరిహారం ఈ రాశివారు గురుడికి జపం చేయడం హరిహర్ హరిహర స్తోత్రాలు వీటిని పారాయణ చేసిన మంచి ఫలితాలు లభిస్తాయి

మకర రాశి :–  ఈ రాశి వారికి జన్మ శని అయినప్పటికి చిన్న ఆటంకాలు సూచించినా మంచి ఫలితాన్ని వారంలో పొందబోతున్నారు. స్థాన చలనమే  కలుగుతుందేమో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆభరణాల్ని సంపదలని బంధుమిత్రులు కలుసుకోవడం ధనలాభం సుఖజీవనం విశేషతను ఇవన్నీ మీకున్న ఉత్తమ ఫలితాలు. అయితే అదే సమయంలో  శని క్షేత్రంలో గురుడు చేరడం వల్ల కాస్త ఒద్దికగా ఓపికగా కొన్ని పనులను చేసుకోగలుగుతారు. చంద్ర సంచారంలో మీకు కొంత కార్యహాని సూచిస్తుంది. అయితే అదే చంద్రుడు మీకు ధనలాభం నివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు షష్ట రాహువు అయ్యాడు  గనుక స సుఖ సంతోషాల్ని ఇస్తాడు. కుటుంబంతో కలిసుంటారు. మీకు దైవ కార్యక్రమాలపై వ్యయం జరుగుతుంది. అది మీ శ్రేయస్సుకే కాబట్టి దాన్ని మనః పూర్తిగా అంగీకరిస్తే మంచిది. జన్మ శనిని మరువ కండి. తొందరపడి కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి.  ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు వారికి జన్మ సారింది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి శ్రవణ నెట్టు త్రినాధులు పరమమిత్రతార ది మధ్యాహ్నాన్ని స్తున్నాయి ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వరకు మిత్ర తానేనని కాబట్టి సోహ్రా ఎక్కువగా ఉన్నాయి.

 పరిహారం: మీరు శనివారం దీక్ష  వహించండి వెంకటేశ్వర స్వామిని పూజించండి శనీశ్వరునికి  అభిషేకం చేయండి నువ్వులు దానం చేసినా చిమ్మిలి గా చేసి తిన్నా చాలా మంచిది.

కుంభ రాశి :– ఈ రాశి వారికి ఈ వారం అగ్ని పరీక్ష అవుతుంది. ఎప్పుడూ కలగనన్ని ఇబ్బందులు ఈ వారంలో మీరు పొందబోతున్నారు. ప్రతి గ్రహము మీకు ప్రతికూలంగా పనిచేసే సమయం ఆసన్నమైంది.  మీరు ముందుకు వెళ్లలేక వెనక్కి తగ్గ లేక ఇబ్బంది పడతారు. మీకు ప్రస్తుతమున్న సమస్యలు కాకుండా అదనంగా కొన్ని సమస్యలు మీరు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది . అయితే ఇంట్లో భార్య కొంత అనుకూలత వుంది కనుక ప్రశాంతతను పొందగలుగుతారు. విశేష ధన లాభాన్ని కేతువు సూచిస్తున్నాడు. కనుక కొన్ని విషయాల్లో మీరు ధైర్యం వహించ గలుగుతారు. కానీ మీకు ఈ వారం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంటుంది. ప్రతి పనిలోని మీకు బుధుడు చిక్కులు కలిగిస్తే రవి భయాన్ని కలిగిస్తున్నాడు. చంద్రుడు కార్యహాని రోగాన్ని కలిగిస్తున్నాడు. కుజుడు కష్టాన్ని తెచ్చి పెడుతూ ఉంటే శని ధన నష్టం కలిగిస్తాడు. గురుడు మీ జ్ఞానానికి పరీక్ష పెడుతున్నాడు. ఎన్నడూ లేనంత మానసిక ఆందోళనను శారీరిక ఇబ్బందుల్ని మీరు ఎదుర్కొంటారు. పిల్లలతోనూ కుటుంబంతో కూడా మీరు పూర్తి ఆనందాన్ని అనుభవించలేరు. మీరు ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకుండా ఎంతవరకు వీలైతే అంత వరకు మౌనముద్ర వహించడం చాలా మంచిది. అంతేకాదు మీ ఇంట్లో మీరు ఉంటూ దైవ ధ్యానాన్ని లేదా జ్ఞాన సంబంధమైన పుస్తకాల్ని చదువుకుంటూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. దీర్ఘ రోగులకు మాత్రము ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాలసర్పయోగం ఎక్కువ వర్తిస్తుంది. ధనిష్ట మూడు నాలుగు పాదాల వారికి మిత్రతారైంది చాలా బావుంది. శతభిషం వాళ్లకి నైధన తారైంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి . పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి సాధన తారైంది మంచి ఫలితాలు వస్తున్నాయి.

 పరిహారం :- ఈ రాశివారు శనికి జపం చేయించండి శివకేశవుల అభిషేకాలు చేయండి శివుని దర్శనం ప్రతి రోజు సాయంకాలంలో పెట్టుకోండి మంచి ఫలితాలను పొందగలుగుతారు.

మీన రాశి :- ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. స్థానచలనం ఉన్నప్పటికీ అది శుభస్థితి అవుతుంది. అతి ధనలాభం ఉంది. అధిక ధన వ్యయం కూడా ఉంది. ఆకస్మికంగా మీకు సంపద సమకూరే అవకాశం ఉంది. ఈ వారంలో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిగ్రహం చాలా అవసరం.  స్థిరచర ఆస్తుల్లోంచి మీకు లాభాలు రావచ్చు. మాట చేత తత్తరపాటు చే మీ గౌరవ భంగం పొందే అవకాశం వుంది. ఇవన్నీ పొందాలంటే మాటల్లో కటుత్వం తగ్గించండి. అనారోగ్యంఉంది కాబట్టి ఆహార నియమాన్ని పాటించండి. సహజంగా మీకు తిండి పై మక్కువ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో స్వేచ్ఛగా వ్యవహరించకుండా ఉండడం చాలా మంచిది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాట్ల వల్ల మీకు ఇబ్బంది కలగకుండా ఆ పరిచయాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతటితో ఆపండి. మీ పనులన్నీ వెనుక పెట్టే వ్యక్తులు మీకంటే ముందు పనిచేస్తూ ఉంటారు కాబట్టి వారిని ఒక కంట కనిపెట్టి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోండి. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి సాధన తారైంది కాబట్టి ఫలితం శుభప్రదంగా ఉంది. ఉత్తరాభాద్ర వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి ప్రతికూల ఫలితాలున్నాయి. రేవతి వారికి క్షేమ తారైంది సానుకూలంగా ఫలితాలు కలిసివస్తాయి.

పరిహారం :- ఈ రాశివారు గురునికి ఎక్కువగా జపం చేయించండి.   బుధుడికి జపం చేయండి మంచి ఫలితాలు లభిస్తాయి. కొమ్ము శనగలు దానం చేయండి మంచిది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.