సీపీఐ నేత‌ల‌పై విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి ఫైర్‌

By Newsmeter.Network  Published on  13 Jan 2020 9:18 AM GMT
సీపీఐ నేత‌ల‌పై విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి ఫైర్‌

భారత హోం మంత్రి అమిత్ షా పట్ల సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆయన దిగజారుడుతాననికి నిదర్శనమ‌ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర కమిటీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు దిగజారి కమ్యూనిస్టు పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. భారత హోం మంత్రిని వాడు వీడు వీధి రౌడీ గుండా క్రిమినల్ పదాలతో మీరు మీ పార్టీ స్థాయి మీ స్థాయి పెరుగుతుంది అనుకుంటున్నారా ? అని ప్ర‌శ్నించారు.

రాజకీయ పార్టీల విమర్శలను బీజేపీ ఎప్పుడైనా స్వాగతిస్తుంది వ్యక్తిగత విమర్శలను క్షమించే ప్రసక్తే లేదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నామ‌న్నారు. మేము కూడా మీలాగా మరింత కిందికి దిగి కూడా మీ పట్ల మీ పార్టీ పట్ల మాట్లాడవచ్చు మాకు కూడా తెలుసు. మా పార్టీ మాకు సంస్కారం నేర్పింది. మీ పార్టీ మీకు ఈ విషయం అర్థమవుతుందా? బూతులు మాట్లాడటం వ్యక్తిగత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మీడియాలో ప్రదర్శనల కోసం సంచలన వార్తల కోసం మీరు చేసే వ్యాఖ్యలు పనికొస్తాయన్నారు.

మీరే చేసే వ్యాఖ్యల పట్ల ప్రజలు మిమ్మల్ని అసహ్యించు కుంటారన్న విషయాన్ని మీ పార్టీ , మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కమ్యూనిస్టు పార్టీ నేతలు గతంలో కూడా ఇలాగే దిగజారుడు వ్యాఖ్యలు చేయడం నాలుక కర్చుకోవడం క్షమాపణలు చెప్పడం పొరపాటుగా తయారైంది. మీ భాషను చూసి మీ పార్టీ కార్యకర్తలు కూడా అసహ్యించుకుంటున్నారనే విషయాన్ని గుర్తించువాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ దేశం ఇచ్చినటువంటి పదవులకు రాజ్యాంగ స్ఫూర్తికి కమ్యూనిస్టు పార్టీలకు గౌరవం ఉంటే తక్షణం ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బీజేపీకి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

నేడు దేశంలో రాష్ట్రంలో లో భారత కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష భావజాలం చివరకు దేశద్రోహులకు సహాయపడే వారిని ఈ దేశ ప్రజలు తిరస్కరించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కమ్యూనిస్టు పార్టీలకు రామకృష్ణ మీ నేతలకు శిక్షణా తరగతుల్లో వీటిని నేర్పిస్తారా ఇదేనా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతా..? అని ప్ర‌శ్నించారు.

ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలతో కలిసి మీకు సరైన సమయంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బుద్ధి చెబుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్దికోసం పార్టీల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసిన సిపిఐ పార్టీ రామకృష్ణ మీద రాష్ట్ర ప్రభుత్వం సుమోటో కేసు నమోదు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తుందన్నారు.

Next Story