విశాఖలో హై అలర్ట్..క్రికెటర్లకు భద్రత పెంపు

By Newsmeter.Network  Published on  6 Oct 2019 7:49 AM GMT
విశాఖలో హై అలర్ట్..క్రికెటర్లకు భద్రత పెంపు

విశాఖపట్నం: విశాఖకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ ఎత్తున రక్షణ ఏర్పాట్లు చేశారు. భారత్, దక్షిణాఫ్రికా క్రికెటర్లకు కూడా రక్షణ పెంచారు. మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియానికి అదనపు భద్రతాబలగాలు వచ్చాయి. తీరాన్ని కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్‌ పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తీరం వెంట భద్రతను పెంచినట్లు మెరైన్ డీఎస్పీ చెప్పారు.

కొన్ని రోజుల క్రితమే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కూడా తీవ్రహెచ్చరికలు చేశారు. భారత సముద్ర తీరానికి ముప్పు పొంచి ఉందన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు చిన్నచిన్న బోట్ల ద్వారా తీరం నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించాలని చూస్తున్నారని తెలిపారు. నేవీని అప్రమత్తం చేసినట్లు కూడా చెప్పారు. భారత తీరం వెంట అనేక షిఫ్ యార్డులతోపాటు..రక్షణ వ్యూహాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీహరి కోట నెల్లూరు జిల్లా తీరంలో ఉంది. దీంతో కొన్ని రోజులుగా తీరం వెంట గస్తీని కూడా పెంచారు. తాజా ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖకే కాకుండా..తీరం వెంబడి పట్టణాల్లో భద్రతను సమీక్షిస్తున్నారు.

Next Story
Share it