విశాఖ టెస్ట్‌లో కుమ్మేసిన కుర్రాళ్లు..భారత్ ఘన విజయం

By Newsmeter.Network  Published on  6 Oct 2019 8:44 AM GMT
విశాఖ టెస్ట్‌లో కుమ్మేసిన కుర్రాళ్లు..భారత్ ఘన విజయం

విశాఖపట్నం: తీరంలో ఉగ్రముప్ప ఉందని ఒక పక్క హై అలర్ట్ ప్రకటించారు.స్టేడియంలో భద్రతను పెంచారు. ఇవేవీ..టీమిండియా ఆటపై ప్రభావం చూపలేకపోయాయి. విశాఖలో జరిగిన మొదటి టెస్ట్‌లో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఘోరంగా కుప్పకూలింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాప్రికా 191 పరుగులకే కుప్పకూలింది. దీంతో 203 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత బౌలర్లలో షమీ5, జడేజా 4 వికెట్లు పడగొట్టారు.

Piedt's vigil was ended by Shami once again

Ashwin became the joint-quickest to 350 Test wickets

భారత్ మొదటి రెండో ఇన్నింగ్స్‌ల్లో 502/7& 323/4 వద్ద డిక్లేర్‌ చేసింది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 431 , రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది.

Faf was left surprised after leaving a ball from Shami

de Kock was the third of Shami's victims

ఈ టెస్ట్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదిరిపోయే సెంచరీలు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులతో భారత విజయంలో రోహిత్ కీలకపాత్ర పోషించాడు. ఒకే టెస్ట్‌లో 13 సిక్స్‌లు బాది కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. గతంలో 12 సిక్స్‌లతో ఈ రికార్డ్ పాకిస్తాన్‌ ఆటగాడు అక్రమ్ పేరు మీద ఉండేది. 2013లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో 16 సిక్సర్లు, 2017లో ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన టీ20లో 10 సిక్సర్లు బాదాడు రోహిత్. ఇవి ఇప్పటికీ రికార్డ్ గానే ఉన్నాయి. ఐసీసీ టెస్ట్‌ల ర్యాంకింగ్‌లో 120 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది.

Bavuma is left floored by a shooter from Shami

Next Story