అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లకు చుక్కెదురైంది. భారత కెప్టెన్‌, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన తొలి టెస్టులో విరాట్‌ పేలవ ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కోల్పోయాడు. 911 రేటింగ్‌ పాయింట్లతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్ తిరిగి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. విరాట్‌ 906 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా, మ‌యాంక్ అగ‌ర్వాల్ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నారు.

టెస్టు ర్యాంకింగ్స్‌ బ్యాట్స్‌మెన్ల జాబితా ..

 

1 స్టీవ్‌స్మిత్‌ ఆస్ట్రేలియా 911
2 విరాట్ కోహ్లీ ఇండియా 906
3 కేన్ విలియమ్ సన్ న్యూజిలాండ్ 853
4 లబుషేన్ ఆస్ట్రేలియా 827
5 బాబర్ ఆజామ్ పాకిస్థాన్ 800
6 డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా 793
7 జో రూట్ ఇంగ్లాండ్ 764
8 అజింక్యా రహానే ఇండియా 760
9 పుజారా ఇండియా 757
10 మయాంక్ అగర్వాల్ ఇండియా 727

బౌల‌ర్ల విభాగంలో భార‌త పేస‌ర్‌కు జ‌స్‌ప్రీత్ బుమ్రాకు షాక్ త‌గిలింది. తొలి టెస్టులో ఒక్క వికెట్ మాత్ర‌మే తీయ‌డంతో.. తాజా ర్యాకింగ్స్‌లో 11వ ర్యాంకుకు ప‌డిపోయాడు. భార‌త్ నుంచి ర‌విచంద్ర‌న్ అశ్విన్ మాత్ర‌మే టాప్‌-10లో చోటు ద‌క్కించుకున్నాడు.

టెస్టు ర్యాంకింగ్స్‌ బౌలర్ల జాబితా

1 పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా 904
2 నీల్ వాగ్నర్ న్యూజిలాండ్ 843
3 జాసన్ హోల్డర్ వెస్టిండీస్ 830
4 కసిగో రబాడా దక్షిణాఫ్రికా 802
5 మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా 769
6 టీమ్ సౌథీ న్యూజిలాండ్ 794
7 జేమ్స్ అండర్ సన్ ఇంగ్లాండ్ 775
8 హేజిల్ వుడ్ ఆస్ట్రేలియా 769
9 రవిచంద్రన్ అశ్విన్ ఇండియా 765
10 కీమర్ రోచ్ వెస్టిండిస్ 763

ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో ర‌వీంద్ర జ‌డేజా మూడు, అశ్విన్ ఐదోస్థానంలో కొనసాగుతున్నారు. కివీస్ తో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు  ఈనెల 29 నుంచి క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌రుగుతుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్